నెట్టింట వైరల్‌గా మారిన వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. క్రికెట్ ప్రియులు ఫుల్ ఫిదా!

by Disha Web Desk 6 |
నెట్టింట వైరల్‌గా మారిన వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. క్రికెట్ ప్రియులు ఫుల్ ఫిదా!
X

దిశ, ఫీచర్స్: ఇటీవల కాలంలో చాలా మంది కపుల్స్ తమ పెళ్లిని వెరైటీగా ప్లాన్ చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కానుంచి మొదలుకొని పెళ్లిలో ప్రతీ కార్యక్రమాన్ని స్పెషల్‌గా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా చేసుకుంటున్నారు. అలాగే కొందరు మాత్రం తమ టాలెంట్ చూపిస్తూ వెరైటీగా పత్రికను ప్రింట్ చేయించుకుంటున్నారు.

ఇటీవల పలు రకాలు పెళ్లి కార్డులు ఎన్నో నెట్టింట అందరినీ మైమరిపించాయి. తాజాగా, ఓ జంట తమ పెళ్లి కార్డ్‌ను ఐపీఎల్ థీమ్‌తో ప్రింట్ చేయించుకుని క్రికెట్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఐపీఎల్ జరుగుతున్న సమయంలో తమ వివాహం జరుగుతుండటంతో ఈ జంట ట్రెండ్ ఫాలో అవడంతో పాటు సెట్ చేసినట్లు తెలుస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్ కలర్స్‌‌తోపాటుగా వధూవరుల పేర్లను సీఎస్‌కే లోగో లోపల ముద్రించి వావ్ అనిపించారు. అంతేకాకుండా మ్యామ్ ప్రివ్యూ, ప్రిడిక్షన్ అనే పదాలు వాడారు. కాగా ఈ జంట పెళ్లి ఏప్రిల్ 17న అరక్కోణంలోని సెయింట్ ఆండ్రూ చర్చిలో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. గీఫ్ల్టీన్ పెర్సీ, మార్టిన్ రాబర్ట్ అనే దంపతులు ఐపీఎల్ థీమ్ ఉన్న పెళ్లి కార్డ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అతి తక్కువ సమయంలోనే భారీ వ్యూస్ రాబట్టింది.

Next Story

Most Viewed