మోడీ పొలిటికల్ ఫ్యామిలీలో చేరే నేరగాళ్లకు రక్షణ గ్యారంటీ : రాహుల్‌గాంధీ

by Hajipasha |
మోడీ పొలిటికల్ ఫ్యామిలీలో చేరే నేరగాళ్లకు రక్షణ గ్యారంటీ : రాహుల్‌గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్ర‌మోడీ రాజకీయ కుటుంబంలో చేరేవారు నేరస్తులైనా సరే వారికి రక్షణ లభించడం గ్యారంటీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటకలో ఆడబిడ్డలపై జరిగిన ఘోర దురాగతాలపై నరేంద్ర మోడీ ఎప్పటిలాగే మౌనం పాటించడం సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించారు. వందలాది మంది ఆడబిడ్డలను వేధించిన వ్యక్తి (ప్రజ్వల్ రేవణ్ణ) తరఫున ఎన్నికల ప్రచారం చేసిన హీన చరిత్రను మోడీ మూట కట్టుకున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఎంతోమంది ఆడబిడ్డల ఉసురు పోసుకున్న నీచుడు అంత సులువుగా దేశం ఎలా దాటగలిగాడని ఆయన ప్రశ్నించారు. ‘‘కైసర్‌ గంజ్ నుంచి కర్ణాటక వరకు.. ఉన్నావ్ నుంచి ఉత్తరాఖండ్ వరకు ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి మౌనంగా ప్రధానమంత్రి మోడీ పలుకున్న మద్దతు మరెంతో మంది నేరస్తులకు ప్రేరణ ఇస్తోంది’’ అని రాహుల్ గాంధీ మండిపడ్డారు. అలాంటి వాళ్ల రక్షణకు మోడీ రాజకీయ ఫ్యామిలీ గ్యారంటీ ఇస్తోందని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed