ఈసీ 48 గంటల నిషేధంపై స్పందించిన KCR

by Satheesh |   ( Updated:2024-05-01 15:02:15.0  )
ఈసీ 48 గంటల నిషేధంపై స్పందించిన KCR
X

దిశ, వెబ్‌డెస్క్: 48 గంటల పాటు ఎన్నికల ప్రచారలో పాల్గొనకుండా కేంద్రం ఎన్నికల కమిషన్ విధించిన నిషేదంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ స్థానిక మాండలికాన్ని ఈసీ సరిగ్గా అర్ధం చేసుకోలేదని.. తాను మాట్లాడిన కొన్ని పదాలపై కాంగ్రెస్ తప్పుగా ఫిర్యాదు చేసిందని క్లారిటీ ఇచ్చారు. ఈసీ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ సరిగ్గా చేయలేదన్నారు. మీడియా సమావేశంలో నా వ్యాఖ్యల్లో కొన్ని పదాలను మాత్రమే తీసుకుని ఈసీకి ఫిర్యాదు చేశారని అన్నారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్.. ‘కుక్కల కొడుకులు’ అంటూ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.

దీంతో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదును స్వీకరించిన ఈసీ.. కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఈసీ నోటీసులకు కేసీఆర్ రిప్లై ఇచ్చినప్పటికీ సంతృప్తి చెందని ఎన్నికల కమిషన్ కేసీఆర్‌పై 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌లో ఉండగా కేసీఆర్‌పై ఈసీ 48 గంటల నిషేదం విధించడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Read More...

BREAKING: ఈసీ సంచలన నిర్ణయం.. కేసీఆర్‌ ప్రచారంపై 48 గంటల నిషేదం

Advertisement

Next Story

Most Viewed