KTR : ఇదెక్కడి అరాచకం.. కేసీఆర్ గొంతుపై మాత్రమే నిషేధమా

by Mahesh |   ( Updated:2024-05-01 15:02:43.0  )
KTR : ఇదెక్కడి అరాచకం.. కేసీఆర్ గొంతుపై మాత్రమే నిషేధమా
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేసి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని ఈసీ కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది. దీంతో కేసీఆర్ మే 1 రాత్రి 8 నుంచి 48 గంటల పాటు ఎటువంటి సభలు, సమావేశాలు ఇంటర్వ్యూలలో పాల్గొనవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేశారు. కాగా దీనిపై మీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేటీఆర్ తన ట్వీట్‌లో ఆవాజ్ ఫర్ తెలంగాణ కేసీఆర్ గొంతుపై మాత్రమే నిషేధమా అంటూ ప్రశ్నించారు. అలాగే మోడీ చేసిన వ్యాఖ్యలపై వేలాది మంది పౌరులు ఫిర్యాదు చేసినా మోదీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు..కేసీఆర్ పోరుబాటకు బీజేపీ కాంగ్రెస్ ఎందుకు వణుకుతున్నాయి. మీ అహంకారానికి, సంస్థాగత దుర్వినియోగానికి తెలంగాణ ప్రజలు తగిన సమాధానం ఇస్తారని కేటీఆర్ తన ట్వీట్ రాసుకొచ్చారు.

Read More...

ఈసీ 48 గంటల నిషేధంపై స్పందించిన KCR

Advertisement

Next Story