మోడీ బీసీ కాదు.. ప్రధాని క్యాస్ట్‌పై CM రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్

by Satheesh |   ( Updated:2024-05-01 14:05:22.0  )
మోడీ బీసీ కాదు.. ప్రధాని క్యాస్ట్‌పై CM రేవంత్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో బుధవారం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఓబీసీ నేత అని మోడీ చెప్పుకుంటారు.. కానీ ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కాదు.. ఆయన కన్వర్టెడ్ బీసీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ సీఎం కాకముందు మోడీ కులం ఓసీనే అని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం అయ్యాక మోడీ తన కులాన్ని బీసీగా మార్చుకున్నారని, మోడీ కన్వర్టెడ్ బీసీ కాబట్టే.. బీసీలపై ఆయనకు ప్రేమ లేదని షాకింగ్స్ కామెంట్స్ చేశారు. అబద్ధాల యూనివర్శిటీకి ప్రధాని మోడీ వీసీ, అమిత్ షా రిజిస్ట్రార్ అని ఎద్దేవా చేశారు.

రిజర్వేషన్ల రద్దు కోసమే బీజేపీ 400 సీట్లు కావాలని చూస్తోందని ఆరోపించారు. అమిత్ షా వీడియోల వ్యవహారంలో ఎవరో ఫిర్యాదు చేస్తే తనపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లినట్లు ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు. మోడీ, అమిత్ షా పోలీసులతో నన్ను బెదిరించాలని చూస్తే అది జరగని పనని.. నన్ను బెదిరించాలనే ప్రయత్నాన్ని మోడీ, అమిత్ షా విరమించుకోవాలని సూచించారు. తనను బెదిరిస్తే ఏం జరుగుతోందో మాజీ సీఎంను అడగండని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read More...

రిజర్వేషన్ల రద్దుపై CM రేవంత్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్

Advertisement

Next Story