Shocking incident:పెళ్లి పీటలెక్కిన వరుడు..ఆమెను చూసి అక్కడి నుంచి పరార్!

by Jakkula Mamatha |
Shocking incident:పెళ్లి పీటలెక్కిన వరుడు..ఆమెను చూసి అక్కడి నుంచి పరార్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక శ్రావణంలో పెళ్లి ముహుర్తాలు కూడా వచ్చాయి. దీంతో చాలా మంది పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తిరుమలలో ఓ ఘటన కలకలం రేపింది. భార్య ఉండగానే మరో వివాహానికి సిద్ధమయ్యాడు ఓ వ్యక్తి. అసలు విషయంలోకి వెళితే..తాజాగా ఓ వ్యక్తి పెళ్లికి రెడీ అయ్యాడు. ఇక పెళ్లిపీటలపై కూర్చున్న వరుడికి తన మొదటి భార్య షాకిచ్చింది. ఆ వ్యక్తికి ఇది వరకే వివాహమైంది. అతనికి ఒక పాప కూడా ఉంది. అయితే కొన్ని మనస్పర్థల కారణంగా ఇద్దరు దూరంగా ఉంటున్నారు. ఈ గొడవలు విడాకుల వరకు దారి తీశాయి. కానీ వీరి విడాకుల కేసు కోర్టులో ఉండగానే అతడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. తిరుమలలోని ఓ మఠంలో వివాహం చేసుకోబోతున్నట్లు అతని భార్యకు సమాచారం అందడంతో తిరుమలకు చేరుకుంది. అక్కడ పెళ్లి పీటలపై కూర్చున్న వరుడు ఆమెను చూడగానే పరారయ్యే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడే ఉన్న పలువురు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed