నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం నటుడి ఫస్ట్ లుక్.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ ట్వీట్

by Kavitha |   ( Updated:2024-10-30 16:34:08.0  )
నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం నటుడి ఫస్ట్ లుక్.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ ట్వీట్
X

దిశ, సినిమా: నందమూరి హరికృష్ణ(Harikrishna) మనవడు, జానకిరామ్(Janaki Ram) కుమారుడు తారక రామారావు(Taraka Rama Rao) హీరోగా వైవీఎస్ చౌదరి(YVS Chowdary) ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా వైవీఎస్.. తారక రామారావు ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. పవర్ ఫుల్ లుక్స్‌తో, బేస్ వాయిస్‌తో చూడగానే ఆకట్టుకునే లుక్‌లో నందమూరి నాలుగో తరం వారసుడు దర్శనం ఇచ్చాడు. ఈ క్రమంలో ఆయనకు ఆల్‌ది బెస్ట్ చెబుతూ బాబాయ్‌లు జూనియర్ ఎన్టీఆర్(Junior NTR), నందమూరి కళ్యాణ్ రామ్‌(Nandamuri Kalyan Ram)లతో పాటు పలువురు ట్వీట్లు చేశారు. వీటిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ నెట్టింట ఆకట్టుకుంటోంది.

“ఆల్‌ది బెస్ట్ రామ్.. సినీ ప్రపంచం మీకు ఆదరించడానికి లెక్కలేవన్ని క్షణాలను అందజేస్తుంది. మీకు అన్ని విజయాలే దక్కాలి. మీ ముత్తాత ఎన్టీఆర్ గారు, తాతగారు హరిక‌ృష్ణ గారు, నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి. మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారగా.. నందమూరి ఫ్యాన్స్ నాలుగో తరం వారసుడికి వెలకమ్ చేస్తూ ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు.


Click Here For Twitter Post:

Advertisement

Next Story

Most Viewed