Ponnam: పండుగ వేళ అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

by Ramesh Goud |   ( Updated:2024-10-30 09:15:59.0  )
Ponnam: పండుగ వేళ అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనావాస సముదాయాల్లో టపాసుల దుకాణాలు(Crackers Shops) లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని హైదారాబాద్(HYD) ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు(Diwali Wishes) చెప్పిన పొన్నం.. నగరంలో అగ్ని ప్రమాదాలు(Fire Accedents) జరగకుండా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా.. దీపావళి ఒక పెద్ద వేడుక అని, ఈ పండగ సందర్భంగా జరిగే అగ్నిప్రమాదాలు నివారించడానికి టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్రం(State) మరియు జంట నగరాల్లో టపాసుల దుకాణాలు చిన్న చిన్న గల్లి(Streets)ల్లో ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే హైదారాబాద్ లో అబిడ్స్(Abids) తో పాటు యకత్‌పుర(Yakathpura)లోని చంద్రానగర్‌లో టపాసుల దుకాణాలు వల్ల రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయని, అదృష్టవశాత్తూ పెద్దగా ప్రమాదం జరగలేదని తెలిపారు.

టపాసుల దుకాణాల వల్ల ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఆ టపాసుల దుకాణాలని మైదాన ప్రాంతాల్లో(Open Areas) ఏర్పాటు చేసుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని హైదారాబాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే వెంటనే ఎక్కడైనా చిన్న చిన్న గల్లిల్లో జన నివాస ప్రాంతాల్లో, వ్యాపార ప్రదేశాల్లో ఇలాంటి టపాసుల దుకాణాలు నిర్వహించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వాటికి ప్రత్యామ్నాయంగా హైదరాబాదులోని ఖాళీ ప్రదేశాలు, క్రీడా మైదానాలు, పాఠశాలను టపాసుల దుకాణాలుగా వాడుకోవాలని, ఎక్కడైనా నివాస ప్రాంతాల మధ్య టపాసుల దుకాణాలు ఉంటే సంబంధిత ఏరియా అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రమాదాలు నివారించడానికి అందరు సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని, ఎక్కడైనా జనావాసాలు, నివాస సముదాయాల్లో టపాసులు అమ్ముతుంటే సంబంధిత అధికారికి ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story