చాందినితో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?

by Hamsa |
చాందినితో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు. కొందరు సీక్రెట్‌గా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటుంటే.. మరికొందరు మాత్రం వివాహం చేసుకుని షాకిస్తున్నారు. తాజాగా, నటితో ‘కలర్ ఫొటో’ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్(Sandeep Raj) ఏడడుగులు వేయబోతున్నట్లు సమాచారం. సందీప్, చాందిని రావు(Chandini Rao) గత కొద్ది రోజుల నుంచి ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘కలర్ ఫొటో’(Colour Photo ), హెడ్స్ అండ్ టేల్స్ వంటివి చేసిన క్రమంలోనే వీరి మధ్య స్నేహం ఏర్పడింది.

అది కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు వెళ్లబోతున్నారట. అయితే వీరిద్దరి నిశ్చితార్థం నవంబర్ 11న విశాఖ పట్టణంలో జరగనున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక డిసెంబర్ 7న తిరుమల తిరుపతి(Tirupati) ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయంలో సందీప్, చాందిని పెళ్లి జరగబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed