Kadambari Jethwani: కాదంబరి జెత్వానీ కేసులో సీఐడీ విచారణ షురూ..

by Shiva |
Kadambari Jethwani: కాదంబరి జెత్వానీ కేసులో సీఐడీ విచారణ షురూ..
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన ముంబై నటి కాదంబరీ జెత్వానీ (Kadambari Jethwani) కేసును రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఇటీవలే సీఐడీ (CID)కి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేసుకు సంబంధించి కీలక ఫైళ్లను విజయవాడ (Viayawada)లోని ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) పోలీసుల నుంచి సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అధికారులు నేడు విచారణను ప్రారంభించారు. కేసులో స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు నేడు జెత్వానీ తల్లిదండ్రులు సీఐడీ అధికారుల (CID Officials) ఎదుట హాజరయ్యారు.

కాగా, కేసులో ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్‌ (Kukkala Vidyasagar)ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. దీంతో విద్యాసాగర్‌(Vidya Sagar)ను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సీఐడీ (CID) అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం సీఐడీ విచారణ ప్రారంభం కావడంతో మరోసారి కాదంబరీ జెత్వానీ, తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed