- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ramayana: వారెవ్వా! రామాయణంపై ఇంత అద్భుతమైన అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడూ చూసుండరు
దిశ, వెబ్‌డెస్క్: శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని రమణీయ ఇతిహాసం రామాయణం. హిందువులంతా ఈ కావ్యాన్ని ఎంతో భక్తితో ఆదరిస్తారు, పూజిస్తారు. అలాంటి ఇతిహాసంపై శ్రీలంక ఎయిర్లైన్స తాజాగా విడుదల చేసిన ఓ అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటివల శ్రీలంక విమానాయన సంస్థ అయిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ శ్రీలంకలోని రామాయణ ఇతిహాసంతో సంబంధం ఉన్న అన్ని ప్రదేశాలకు సందర్శకులను తీసుకెళ్లేందుకు ‘ద రామాయణ ట్రెయిల్స్’ అనే పేరుతో ఓ సర్వీసును మొదలుపెట్టింది. ఈ సర్వీసును ప్రమోట్ చేయడానికి ఓ అడ్వర్టైజ్మెంట్ను రూపొందించి విడుదల చేసింది. అందులో ఓ బామ్మ తన మనవడికి రామాయణ ఇతిహాసాన్ని బొమ్మల రూపంలో వివరిస్తుండగా.. శ్రీలంకలోని రామాయణంతో సంబంధం ఉన్న ప్రాంతాలతో పాటు రామసేతువును కూడా చూపించారు. ఐదునిముషాల నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను దుమ్ము రేపుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రామాయణం గురించి అద్భుతమైన వీడియో చేశారని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.