Viral News: మొలకెత్తే పెళ్లి ప్రత్రిక.. వారెవ్వా.. ఏం ఐడియా గురూ..!

by Indraja |   ( Updated:2024-03-26 09:58:56.0  )
Viral News: మొలకెత్తే పెళ్లి ప్రత్రిక.. వారెవ్వా.. ఏం ఐడియా గురూ..!
X

దిశ వెబ్ డెస్క్: మనిషి జీవితంలో పెళ్లి అనేది అత్యంత ప్రాధ్యాత కలిగిన ఘటం. అందుకే ఎవరికి ఉన్నంతలో వాళ్ళు పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకోవాలి అనుకుంటారు. ఇక బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్ళకు పెళ్లి పత్రిక ఇచ్చి పెళ్ళికి రమ్మని ఆహ్వానిస్తారు.

అయితే కొందరు సాధారణ పెళ్లి పత్రికలను పంచితే.. మరికొందరు వివిధ డిజైన్స్ లో ఖరీదైన పెళ్లి కార్డులను పంచుతారు. అయితే పెళ్లి కార్డు ఎంత ఖరీదైనది అయినా.. పెళ్లి తంతు ముగిశాక ఆ కార్డును ఎవరు పట్టించుకోరు.

అయితే ఓ యువతి మాత్రం తన పెళ్లి కార్డు తీసుకున్నవాళ్లకు తన పెళ్లి తరువాత కూడా ఆ కార్డు అలానే గుర్తుండిపోవాలని ఆశించింది. అందుకే ఎవరు ఆలోచించని విధంగా వినూత్న రీతిలో అలోచించి పర్యావరణ హితమైన మొలకెత్తే పెళ్లి కార్డులు చేయించుకుంది స్వర్ణలత అనే యువతి.

అలానే పెళ్ళికార్డుతోపాటుగా అందించే పెన్నులోనో వైవిధ్యాన్ని చూపించింది. పెళ్లి కార్డులో తులసి, బంతి, చామంతి వంటి పూల మొక్కల విత్తనాలు, అలానే పెన్నుల్లో టమాటా, బెండకాయ, వంకాయ వంటి కూరగాయలు, కొత్తీమీర, పాలకూర విత్తనాలు ఉన్నాయి. వాటిని రెండు గంటల సేపు నీటిలో నానబెట్టి ఆ తరువాత మట్టిలో పాతిపెడితే చాలు వాటి నుండి మొలకలు వస్తాయి.

కాగా ఈ పెళ్లి పత్రికలను, పెన్నులను కోయంబత్తూరు నుండి ఆమె తెప్పించుకున్నారు. మొత్తం 1250 పెళ్లి పత్రికలను, 500 పెన్నులను ఆర్డర్ ఇచ్చి స్వర్ణలత చేయించుకున్నారు.

Advertisement

Next Story