Viral News: రైలులో ‘స్పైడ‌ర్‌మ్యాన్’ స్టంట్‌! ఎందుకో తెలుసా?

by Ramesh N |   ( Updated:2024-04-03 07:53:05.0  )
Viral News: రైలులో ‘స్పైడ‌ర్‌మ్యాన్’ స్టంట్‌! ఎందుకో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. ఆ రద్ధీగా ఉండే రైళ్లలో ఎక్కువ దూరం ప్రయాణించడం ఒక సాహసోపేతమైన పని. ముఖ్యంగా జనరల్, స్లీపర్ క్లాస్ బోగీల్లో కూర్చోడానికి కాదు కదా నిలబడడానికి కూడా కొన్ని రైళ్లలో చోటు ఉండదు. అలాంటి రైలులో బాత్రూమ్‌కి వెళ్లడం అంటే ఎంతో సహసమనే చెప్పాలి.. ఇది రైలు ప్రయాణికులకు అందరికీ అనుభవమే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

నిలబడడానికి చోటు లేని రద్దీగా ఉన్న ఓ ట్రైన్‌లో ఓ యువకుడు ఏకంగా స్పైడర్ మ్యాన్ స్టంట్ వేయాల్సి వచ్చింది. తను (రెస్ట్ రూమ్‌) బాత్రూమ్ వెళ్లేందుకు జనాల తలపై నుంచి స్టంట్ వేసుకుంటూ వెళ్తున్నాడని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. మరి అబ్బాయిలు స్టంట్‌లు వేస్తారు.. మరి మహిళలు ఆ రైలులో రెస్ట్‌రూమ్‌కి వెళ్లాలంటే ఏమిటి పరిస్థితి అని నెటిజన్లు రైల్వే అధికారులను ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story