ఇదేం వాడకం రా బాబు! కస్టమర్లు మిగిల్చిన చట్నీని మరో రోజుకి వినియోగం!

by Ramesh N |   ( Updated:2024-04-17 12:34:02.0  )
ఇదేం వాడకం రా బాబు! కస్టమర్లు మిగిల్చిన చట్నీని మరో రోజుకి వినియోగం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హోటల్లలో కస్టమర్లకు ఇచ్చిన చట్నీలు మిగిలితే వాటిని మళ్లీ మరుసటి రోజు కోసం వాడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వేదికగా ఓ వీడియో వైరల్ అవుతుంది. హైదరాబాద్ - బేగంపేట్‌లోని మెజ్బాన్ హోటల్‌లో కస్టమర్లు మిగిల్చిన గ్రీన్ చట్నీ, టొమాటో సాస్ మళ్ళీ ఒక బౌల్‌లో వేసి మరుసటి రోజుకు వాడుతున్నారని మూజిక్ ఆఫ్ అరుణ్ అనే నెటిజన్ సోషల్ మీడియా వేదికగా వీడియో పోస్ట్ చేశారు.

వీడియోలో రెస్టారెంట్ సిబ్బంది మిగిల్చిన టమాటో సాస్ వేరే బౌల్‌లోకి వేస్తున్నారు. దీనిపై ఆ నెటిజన్ మరింత వివరణ ఇస్తూ.. ‘వేరే రెస్టారెంట్ లో ఇలాగే చేస్తారేమో, మనకి తెలియదు, చట్నీస్‌లో చట్నీలు రీఫిల్ చేసి తెస్తారు, అది మనకోసం ఫ్రెష్‌గా కడిగి తెస్తారని లేదు కదా.. అలాగే ఇది అని సరిపెట్టుకోవడమే. ఐతే.. ఇక్కడ మన కళ్లముందే చేశారు అది ప్రత్యేక వ్యత్యాసం’ అని నెటిజన్ పేర్కొన్నారు. దాదాపు ప్రతీ రెస్టారెంట్‌లో ఇదే పరిస్థితి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీకి ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేయగా.. జీహెచ్ఎంసీ స్పందించింది. జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ త్వరగా సమస్యను పరిష్కరిస్తుందని తెలిపింది.

Advertisement

Next Story