- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఖమ్మం జాతరలో రికార్డింగ్ డాన్సులు.. వీడియో వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: దేవుని జాతరలో అసభ్యకరమైన నృత్యాలు నిర్వహించి ఆచారాలను కొంత మంది భ్రష్టు పట్టిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినయకపురంలో ముత్యాలమ్మతల్లి జాతర నిర్వహించారు. ఈ జాతరలో బుధవారం రాత్రి డాన్స్ బేబీ డాన్స్ పేరుతో యువతులతో హద్దులు దాటి రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించారు. మరోవైపు జాతరలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు సైతం ఈ డ్యాన్సులు చూశారు తప్ప.. ఎలాంటి చర్యలు తీసుకోవలేదన్న విమర్శలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
జాతర పేరుతో అసభ్యకర రికార్డింగ్ డ్యాన్సులు ఏంటని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటువంటి డ్యాన్స్‌లతో నేటి యువతకు మీరు ఏం నెర్పిస్తున్నారని నిలదీస్తున్నారు. జాతరలో రాత్రి సమయంలో రికార్డింగ్ డాన్స్‌ల పేరుతో హద్దులు దాటి పోతుంటే స్థానిక నాయకులు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.