- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టోల్ కట్టమన్నందుకు మహిళా ఉద్యోగిపై దాడి.. ఆమె రియాక్షన్ హైలెట్! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః టోల్ ట్యాక్స్ చెల్లించని ఓ వ్యక్తిని గుర్తింపు కార్డు చూపించమన్నందుకు మహిళా టోల్ ఆపరేటర్‌పై దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రాజ్‌గఢ్‌లో ఆగస్టు 20న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం ట్విట్టర్‌లో పోస్ట్ కాగా, వైరల్‌గా మారింది. ANI నివేదిక ప్రకారం, ఈ ఘటనకు సంబంధించిన వీడియో బియోరా దేహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కచ్నారియా టోల్ ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోలో, ఓ వ్యక్తి టోల్ కట్టమన్న మహిళా ఉద్యోగిని చెంపపై కొట్టగా, ఆ తర్వాత, మహిళా ఉద్యోగి చెప్పు తీసుకొని, తనపై దాడి చేసిన వ్యక్తిని కొట్టడం ప్రారంభిస్తుంది. అతను తిరిగి దాడి చేస్తూనే ఉండగా, సదరు మహిళా ఉద్యోగికి సహాయంగా వచ్చిన మరో మహిళ అతడిపై దాడి చేయడానికి కౌంటర్‌లో నుండి దిగడాన్ని చూడొచ్చు.
ఇక, టోల్ కట్టని రాజ్‌కుమార్ గుర్జార్ అనే ఆ వ్యక్తి తాను స్థానికుడినని, అందువల్ల టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని మహిళకు చెప్పగా, స్థానికుల మినహాయింపు పొందడానికి అతణ్ణి నివాస ధృవీకరణ పత్రం ఆధార్ కార్డును చూపించమని అడగడంతో అతను కోపంగా ఆమెపై దాడికి దిగినట్లు తెలుస్తుంది. అయితే, అతని వాహనానికి ఫాస్ట్‌ట్యాగ్ లేదని పోలీసులు ధృవీకరించారు. అయితే, ఈ సంఘటనకు సంబంధించి, నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని, పరారిలో ఉన్న నిందితుణ్ణి త్వరలో అరెస్టు చేస్తామని బియోరా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ రామ్‌కుమార్ రఘువంశీ తెలిపారు.
#WATCH| Madhya Pradesh: A man slapped a female toll operator after being refused to leave without paying tax in Rajgarh
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 21, 2022
A case has been registered against the accused for the incident dated Aug 20. Soon he'll be arrested: Ramkumar Raghuvanshi, Biaora PS in-charge
(Source: CCTV) pic.twitter.com/bbdkinLPZf