- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేయ్.. ఇవేం పనులు రా? రోడ్డు మధ్యలో బైక్ పార్క్ చేసి రీల్స్.. చివరికి అరెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొందరూ ఈ మధ్య వింతగా ప్రవర్తిస్తూ రీల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలోనే ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ రోడ్లపై స్టంట్స్ రీల్స్ చేసిన స్పైడర్ మ్యాన్ జంటను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల విపిన్ కుమార్ రద్దీగా ఉండే జీటీ కర్నాల్ రోడ్డు మధ్యలో బైక్ పార్క్ చేసి.. కుర్చీ వేసుకుని కూర్చుని రీల్స్ చేశాడు. దీంతో వాహన దారులకు ఇబ్బంది కలిగించాడు.
ఈ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. విపిన్‌పై మోటారు వాహనాల చట్టం, వివిధ సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఢిల్లీ పోలీసులు వైరల్ అయిన రీల్ పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందించారు. రేయ్.. ఇవేం పనులు రా అయ్యా? ఇతరులకు ఇబ్బందిని కలుగజేస్తూ రీల్స్ చేయడం ఏమిటని నెటిజన్లు అతడిపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వ్యక్తులకు భారీగా జరిమానా విధించాలని పోలీసులను డిమాండ్ చేశారు.