హనీమూన్‌కి వెళ్లి గుర్రం మీద నుంచి పడి వ్యక్తి మృతి

by Mahesh |   ( Updated:2023-01-30 07:25:11.0  )
హనీమూన్‌కి వెళ్లి గుర్రం మీద నుంచి పడి వ్యక్తి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటివలే వివాహం చేసుకున్న ఓ యువకుడు తన భార్యతో కలిసి హనీమూన్‌ ఎంజాయ్ చేయడానికి వెళ్లాడు. కానీ అక్కడ అనుకోని సంఘటన జరిగి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన 23 ఏళ్ల వ్యక్తి హనీమూన్‌ కోసం హిల్ స్టేషన్ అయిన మాథెరన్‌ వెళ్లాడు.

అక్కడి నుంచి సరదాగా గుర్రంపై వెళుతుండగా.. గుర్రం అకస్మాత్తుగా వేగం పుంజుకుంది. దీంతో అతను అదుపు తప్పి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 108 అంబులెన్స్ సర్వీస్‌లో పనిచేస్తున్న డాక్టర్ సచిన్ వానీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed