- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kavya Maran: కేన్ మామను గట్టిగా హగ్ చేసుకున్న కావ్య పాప.. అతడిని ఇంకా మర్చిపోలేకపోతోందా? (వీడియో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: ‘కేన్ విలియమ్సన్’.. ఆ పేరు వింటేనే ఓ ఎమోషన్, సగటు ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్‌కు అతడితో ఏదో బాండిగ్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే అంతలా కనెక్ట్ అయ్యాడు మన హైదరాబాదీలకు అతడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్ తన ఆట తీరుతో అందరిని ఆకట్టుకున్నాడు. మైదానంలో ఎంత టెన్షన్ ఉన్నా.. ముఖంలో మాత్రం ఆ స్మైల్ చెదరదు. ఎంచక్కా.. ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ అతడిని కేన్ మామ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే, ఐపీఎల్ 2023 వేలానికి ముందు ఎస్ఆర్‌హెచ్ కేన్ విలియమ్సన్‌ను రిలీజ్ చేసింది. కానీ, ఫ్రాంచైజీతో మాత్రం ఇంకా మంచి ర్యాపోనే మెయిన్‌టెయిన్ చేస్తూ వస్తున్నాడు. అనంతరం జరిగిన వేలంలో కేన్ మామను గుజరాత్ టైటన్స్ జట్టు సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే గురువారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, వర్షం కారణంగా మ్యాచ్ టాస్ పడకుండానే రద్దైంది. దీంతో కేన్ మామ స్టాండ్స్‌లో కూర్చున్న కావ్య దగ్గరికి వెళ్లి ప్రేమగా పలకరించాడు. ఆమె కూడా అలానే రియాక్ట్ అయింది. దీంతో ఒకరినొకరు హగ్ చేసుకుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను సన్‌రైజర్స్ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.