భారత్‌‌కు జపాన్‌ CEO ఫిదా.. ప్రపంచానికి భారతీయుల నాయకత్వం అవసరమని ప్రశంసలు

by Indraja |
భారత్‌‌కు జపాన్‌ CEO ఫిదా.. ప్రపంచానికి భారతీయుల నాయకత్వం అవసరమని ప్రశంసలు
X

దిశ వెబ్ డెస్క్: భారత దేశంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి జపాన్‌ టెక్‌ కంపెనీ కోఫౌండర్‌ సీఈఓ నౌటకా నిషియామా ఏప్రిల్‌లో బెంగళూరుకు వచ్చారు.కాగా ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాలు తనని ఆకట్టుకున్నాయి. ఇదే విషయాన్ని ఆయన లింక్డిన్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం అస్తవ్యస్తంగా ఉందని, అలాంటి ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్లే సత్తా ఓక్క భారత దేశానికి మాత్రమే ఉందని కొనియాడారు.

ప్రపంచానికి భారతీయుల నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. నెల రోజులు క్రితం తాను భారత దేశానికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో వైవిధ్యభరితమైన విలువలతో కూడిన దేశాన్ని మొదటిసారి చూస్తున్నట్టు ఆశ్చర్యపోయారు. వివిధ మతాలు, జాతులు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం చాటిన దేశం భారత దేశం అని, ప్రపంచ దేశాల్లో భారత దేశం అద్భుతమైన దేశం అని పేర్కొన్నారు.

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ల విజయాల్ని గుర్తు చేశారు. వ్యాపార రంగంలో విజేతలుగా నిలిచిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల రెండవ తరం అమెరికన్లు కాదని, వారు పుట్టిపెరిగింది, చదువుకుంది ఈ దేశంలోనే అని, కేవలం పై చదువుల కోసం అమెరికాకు వెళ్లి నేడు టెక్‌ రంగాల్ని శాసిస్తున్నారంటూ భారత్‌ను ప్రశంసిస్తూ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story