తెలంగాణ పల్లెలు చాలా బాగున్నాయి: ట్రైని ఐఏఎస్, ఐపీఎస్‌లు

by Mahesh |   ( Updated:2024-10-24 17:15:48.0  )
తెలంగాణ పల్లెలు చాలా బాగున్నాయి: ట్రైని ఐఏఎస్, ఐపీఎస్‌లు
X

దిశ, అలంపూర్ : తెలంగాణ పల్లెలు చాలా బాగున్నాయని, ప్రతి ఒక్కరు డిజిటల్ రంగం వైపు నడుస్తున్నారని ట్రైని ఐఏఎస్, ఐపీఎస్‌లు అన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు శిక్షణలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని కలుకుంట్ల గ్రామానికి చేరుకున్నారు. ఫీల్డ్ విజిట్ లో భాగంగా మూడు రోజుల పర్యటన పూర్తిచేసుకుని మానోపాడు మండల కేంద్రానికి గురువారం ఉదయం చేరుకొని పాఠశాలలను, అంగన్వాడి సెంటర్లను, ప్రభుత్వ కార్యాలయాలను విజిట్ చేశారు. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని చేశారు. ఉన్నత శిఖరాన్ని అవరోహించాలంటే మనం చదువుకుంటున్న చదివే దారి చూపిస్తుందని, ఏ విద్యార్థి కూడా నిర్లక్ష్యం చేయకుండా చదువుకుంటూ ముందుకు సాగినప్పుడే.. తాము అనుకున్న గోల్ రీచ్ అవుతామని విద్యార్థులకు తెలిపారు.

ఐపీఎస్, ఐఏఎస్ లాంటి ఉన్నత అర్హత పొందడానికి డబ్బు, ఆస్తులు అవసరం లేదని, చదివే సర్వంగా భావించి ముందుకు వెళ్ళినప్పుడు సాధించవచ్చు అని తెలిపారు. అనంతరం ఐదు మంది ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు మీడియాతో ట్రైనీ అధికారులు డాక్టర్ ప్రసన్న కుమార్, వల్లి, అభిషేక్, రాజీవ్, విజయ్ ఘడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లె చాలా బాగుందని, డిజిటల్ మీడియా వైపు ప్రతి ఒక్కరు అడుగులు వేయడం సంతోషమన్నారు. ఇక్కడి ప్రజలు ప్రాంతం చాలా బాగున్నాయని, ప్రతి ఒక్కరి పలకరింపు, గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు, ప్రజలకు సేవలు అందించే అధికారుల తీరు చాలా మెరుగ్గా కనిపించిందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులతో పాటు, ఎంపీడీవో భాస్కర్, ఎంఈఓ శివప్రసాద్, కస్తూర్బా ఇంచార్జ్ అధికారి సునీత, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed