మహారాష్ట్రలో 45 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

by Mahesh Kanagandla |
మహారాష్ట్రలో 45 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ గురువారం 45 మంది అభ్యర్థులను ప్రకటించింది. మహావికాస్ అఘాదీ కూటమిలో 85-85-85 సీట్ల ఫార్ములా నిర్ణయించుకున్న మరుసటి రోజు కాంగ్రెస్ తాజాగా అభ్యర్థులను ప్రటించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీప్ నానా పటోలే సకోలి నుంచి, సంగమ్నేర్ నుంచి లెజిస్లేచర్ పార్టీ లీడర్ బాలాసాహెబ్ థోరట్, బ్రహ్మపురి నుంచి శాసనసభలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్, కరడ్ సౌత్ నుంచి మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్, చందివలి నుంచి రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నసీమ్ ఖాన్‌లు పోటీ చేస్తున్నారు.

మహా వికాస్ అఘాదీ కూటమిలోని కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ వర్గం), ఎన్సీపీ(శరద్ పవార్ వర్గం)ల మధ్య సీట్ల కేటాయింపులు జటిలమయ్యాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ సీట్లల్లో 125 సీట్లు కావాలని కాంగ్రెస్, 100 సీట్లు కావాలని శివసేన పట్టుబట్టాయి. ఇలా మొండికేయడంతో సీట్ల కేటాయింపు వ్యవహారం ముందుకు సాగలేదు. దీంతో శరద్ పవార్ రంగంలోకి దిగి చక్రం తిప్పారు. మూడు పార్టీల ప్రతినిధులు సమావేశమై 85-85-85 ఫార్ములాను నిర్ధారించారు.

Advertisement

Next Story

Most Viewed