దేశ ప్ర‌ధాని ఎవ‌రంటే ఈ విద్యార్థి ఆన్సర్ అదిరిపోయింది!

by Sumithra |
దేశ ప్ర‌ధాని ఎవ‌రంటే ఈ విద్యార్థి ఆన్సర్ అదిరిపోయింది!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఇంటర్నెట్‌లో ఫన్నీ వీడియోల‌కు కొద‌వుండ‌దు. అయితే, కొన్ని మాత్రం మ‌రింత ఆసక్తికరంగా, ఆద్యంతం వినోదం పంచుతాయి. అంత‌కుమించిన ఆలోచ‌న‌ను కూడా రెకెత్తిస్తుంటాయి. అలాంటి ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అయ్యింది. ఇందులో ఒక బాలుడు న్యూస్ రిపోర్టర్ అడిగే ప్ర‌శ్న‌ల‌కు ఉల్లాసంగా స‌మాధానాలు ఇస్తుంటాడు. స్థానిక వార్తా విలేఖరి బీహార్‌కు చెందిన 6 తరగతి బాలుణ్ణి కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాడు. రిపోర్ట‌ర్‌ మొదట ఆ పిల్లాడికి ఇష్టమైన త‌ర‌గ‌తి స‌బ్జెక్ట్ గురించి అడ‌గ్గా, ప్ర‌శ్న‌లో ఉన్న స‌బ్జెక్ట్ అనే మాట‌ను సరిగ్గా అర్థం చేసుకోకుండా, దాన్ని 'స‌బ్జీ' (కూర‌) అనుకొని, చాలా నమ్మకంగా, 'బైగన్' (వంకాయ) అని సమాధానమిస్తాడు. రిపోర్టర్ ఆ అబ్బాయిని అతను 'సబ్జెక్ట్' గురించి అడుగుతున్నానని చెబుతాడు. వెంట‌నే అబ్బాయి "ఇంగ్లీషు." అంటాడు.

త‌ర్వాత రిపోర్ట‌ర్‌, "నీకు ఆంగ్లంలో ఏవైనా పద్యాలు గుర్తున్నాయా?" అంటే, ఈసారి కూడా, బాలుడు నమ్మకంగా తప్పు సమాధానంతో, "అవును…55. నేను 55.. 100 వరకు స్పెల్లింగ్ చేయగలను" అంటాడు. తర్వాత, దేశ ప్రధాని ఎవరో చెప్పమని అడ‌గ్గా, బాలుడు మొదట "నితీష్ కుమార్", ఆపై "లాలూ యాదవ్" అని సమాధానం చెప్తాడు. మ‌ళ్లీ, రిపోర్టర్ PM అనే పదాన్ని నొక్కి చెప్పగానే, "మోదీ" అని అంటాడు. పూర్తి పేరు అడిగినప్పుడు, "మోదీ సర్కార్!" అంటాడు. క‌డుపుబ్బా న‌వ్వు తెప్పించే ఈ వీడియోకు, "లైఫ్ మే బస్ ఇత్నా కాన్ఫిడెన్స్ చాహియే" అని శీర్షిక పెట్టారు.

Advertisement

Next Story