శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు.. ఎస్పీ యోగేష్ గౌతమ్

by Kavitha |
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు.. ఎస్పీ యోగేష్ గౌతమ్
X

దిశ, నారాయణపేట క్రైమ్: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన జెండా వివాద ఘటన దృశ్య.. గురువారం జిల్లా కేంద్రంలో భారీ పోలీసుల మధ్య ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జెండా వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య రాళ్లు రువ్వుకోవడం వరకు దారి తీసిన విషయం తెలిసిందే. ఎస్పీ కార్యాలయం నుంచి జిల్లా కేంద్రం ప్రధాన రహదారి మీదుగా బలగాలను మోహరించారు. మల్టీ జోన్ -2 ఐజి సత్యనారాయణ, జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ ఎస్ చౌహన్ జిల్లా కేంద్రంలో పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. యువత ముఖ్యంగా సంయమనం పాటించాలని అనవసరమైన గొడవలకు పాల్పడితే ఎంతటి వారినైనా చట్టపరంగా శిక్షిస్తామన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా అల్లర్లకు జెండా వివాదం అల్లర్లకు దారి తీసిన వారిని గుర్తించడం జరిగిందన్నారు.

Advertisement

Next Story