- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్రాంతికి ఊరెళ్లే వారికి సూపర్ గుడ్ న్యూస్.. రైల్వేశాఖ కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి (Sankranthi) వచ్చిందంటే చాలు పట్టణాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే వాళ్లంతా సొంతూళ్లకు క్యూ కడుతుంటారు. లక్షల మంది ఊళ్లకు బయల్దేరడంతో రైళ్లు (Trains), బస్సులు (Busses) కిక్కిరిసిపోతాయి. టికెట్ దొరకడమే కష్టమైపోయింది. ఈ సారి కూడా అలాంటి పరిస్థితులే కనిపించాయి. వచ్చే ఏడాది జనవరి 11, 12, 13 తేదీల్లో నగరాల నుంచి రైళ్లలో ఏపీకి వెళ్లాలంటే టికెట్లు లేవు. సంక్రాంతి పండుగకు 4 నెలల ముందే రెగ్యులర్రైళ్లన్నీ ఫుల్‌అయ్యాయి. రిజర్వేషన్ ఓపెన్ చేసిన నిమిషాల్లో టికెట్లన్నీ సేల్ అయిపోయాయి. ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్ కూడా భారీగా పెరిగిపోతోంది. దీంతో ఊళ్ల నుంచి వచ్చి హైదరాబాద్ (Hyderabad)లో ఉంటున్న వారు పండుగకు ఇంటికి వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు.
ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు అనేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు జనవరి 10, 11, 12 తేదీల్లో ఫుల్ అయిపోయాయి. కాకినాడ వైపు వెళ్లే కాకినాడ ఎక్స్‌ప్రెస్, ఎల్‌టీటీ-కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కూడా సీట్లు ఖాళీ లేవు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనన చెందుతున్నారు.
ఇలాంటి టైంలో వీరందరికీ రైల్వేశాఖ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఈ సమస్యపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రైల్వేశాఖ (Railwa Department).. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు 4 నెలల ముందుగానే కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో 2025 సంక్రాంతి కోసం 400 స్పెషల్ ట్రైన్లు నడపనున్నట్లు ప్రకటించింది. ముందుగా వెయిటింగ్ లిస్ట్‌ను తగ్గించేందుకు రెగ్యులర్ రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేస్తామని, అవి కూడా సరిపోకపోతే.. 400 స్పెషల్ ట్రైన్ (400 Special Trains)లు నడపుతామని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.