ఈ ఆలయానికి వెళ్లారంటే కాళ్లు వణకాల్సిందే..

by Disha Web Desk 20 |
ఈ ఆలయానికి వెళ్లారంటే కాళ్లు వణకాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు, పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఒక్కసారి ఆలయానికి వెళ్లారంటే చాలు మనస్సు ఎంతో ప్రశాంతంగా అయిపోతుంది. కానీ ఈ ఆలయానికి వెళ్లారంటే చాలు కాళ్లు కనీసం నడవరాకుండా వణుకుతూ ఉంటాయి. అడుగు తీసి అడుగే వేసే పరిస్థితిలో కూడా ఉండరు అక్కడి వారు. ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది, అక్కడికి వెళ్లిన వారి పరిస్థితి ఎందుకు ఇలా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కొంతమంది వ్యక్తులు ఖాళీ సమయం దొరికిన వెంటనే కొత్త ప్రదేశాలను సందర్శించడానికి వెళ్తాడు. ప్రయాణం చేసేందుకు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ప్రజలు తమ బిజీ షెడ్యూల్‌ల నుండి సమయాన్ని వెచ్చిస్తారు. వారి మానసిక స్థితిని మెరుగుపరచుకుంటారు. అలాగే చాలా మంది మౌంట్ తైషాన్ లా ఉండే చైనాలో ఎంతో ప్రసిద్దిచెందిన అందమైన ప్రదేశానికి వెళుతుంటారు.

సాధారణంగా 50-100 మెట్లు ఎక్కితేనే ప్రజల పరిస్థితి దిగజారిపోతుంది. అయితే పర్యాటకులు ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6600 కంటే ఎక్కువ మెట్లు ఎక్కాలి. ఇక్కడికి ఎక్కిన తర్వాత మనిషి పరిస్థితి ఎలా ఉంటుందంటే వారి కాళ్లు వణుకుతూ కర్ర సాయంతో కూడా మెట్లు ఎక్కలేని పరిస్థితికి వచ్చేస్తారు. మన శరీరం నుండి మన కాళ్ళు మాయమైనట్లు అనిపిస్తుంది.

ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించిన ఓ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రజలు తమ చేతుల్లో కర్రలు పట్టుకుని మెట్లు ఎక్కే పరిస్థితిలో కూడా లేరు. కొంతమంది కాళ్ళు వణుకుతున్నట్లు కనిపిస్తున్నాయి. మెట్ల రెయిలింగ్ పట్టుకుని కష్టపడి కిందకు దిగే వారు ఎందరో కనిపిస్తున్నారు. అలాగే మరికొంత మందిని స్ట్రెచర్ల పై తీసుకెళ్లే పరిస్థితి నెలకొంది.

ప్రస్తుతం ఈ వీడియో @TheFigen అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇప్పటివరకు 2.5 కోట్ల మందికి పైగా ప్రజలు దీనిని చూశారు. ఈ వీడియోని చూసిన వారిలో కొంతమంది ఈ విధంగా తమ మనసులోని మాటలను పంచుకున్నారు. 'సోదరా, ఈ ప్రదేశానికి వెళ్లడానికి ఎవరు ధైర్యం చేయగలరు ?' అని రాస్తే మరొకరు 'అత్యుత్తమ వ్యక్తులు కూడా ఇక్కడికి ఎక్కే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. 'ఈ ప్రదేశానికి చేరుకున్న తర్వాత, చాలా మంది ప్రజలు ఇక్కడికి చేరుకున్న తర్వాత పశ్చాత్తాపపడుతున్నారు.

Next Story

Most Viewed