Viral Video:సినిమా లెవల్‌లో మాజీ లవర్ విశ్వరూపం..అర్జున్ రెడ్డిని దింపేశాడుగా!

by Jakkula Mamatha |   ( Updated:2024-05-22 12:33:19.0  )
Viral Video:సినిమా లెవల్‌లో మాజీ లవర్ విశ్వరూపం..అర్జున్ రెడ్డిని దింపేశాడుగా!
X

దిశ,వెబ్‌డెస్క్:సోషల్ మీడియా వచ్చాక చిత్ర విచిత్రమైన ఘటనలకు కొదవే లేకుండా పోతుంది. ఎన్నో సంఘటనలను మనం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్య పెళ్లిలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కొన్ని పెళ్లీలైతే పీటల వరకు వచ్చి ఆగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది. రాజస్థాన్ లోని భిల్వారాలో సినిమాను తలదన్నే రీతిలో దాడి జరిగింది. తన మాజీ ప్రేయసి తన కళ్లెదుటే వేరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని చూసి ఆమె లవర్ తట్టుకోలేకపోయాడు. ఒక్కసారిగా ‘అర్జున్ రెడ్డి’ మూవీని తలపించే రీతిలో ఆగ్రహంతో ఊగిపోయాడు. ఏకంగా పెళ్లి వేదికపైనే వరుడి పై పిడిగుద్దుల వర్షం కురిపించాడు.

అసలు విషయంలోకి వెళ్లితే.. రాజస్థాన్ పెళ్లి వేడుకల్లో నూతన దంపతులతో ఫొటో దిగేందుకు వేదికపైకి ఎక్కిన ఓ యువకుడు తన మాజీ లవర్ పక్కన నిలబడి ఫొటోలకు పోజులిచ్చాడు. ఆ తర్వాత ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అనంతరం వరుడు వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చినట్లే ఇచ్చి ఒక్కసారిగా దాడి చేయడం మొదలుపెట్టాడు. అతనిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. దీంతో అక్కడున్న వారంతా వెంటనే అతన్ని పట్టుకుని వెనక్కి లాగేశారు. ఈ తతంగాన్నంతా కాస్త దూరం నుంచి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పెళ్లి కూతురు, ఆమె మాజీ లవర్ గతంలో ఒకే పాఠశాలలో పనిచేశారని అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Click Here For Twitter Post..

Advertisement

Next Story