ఉడకని పంది మాంసం తింటున్నారా? స్కానింగ్‌ రిపోర్ట్ చూసి షాకైన వైద్యులు..!!

by Anjali |
ఉడకని పంది మాంసం తింటున్నారా? స్కానింగ్‌ రిపోర్ట్ చూసి షాకైన వైద్యులు..!!
X

దిశ, ఫీచర్స్: సెలీనియం, ఫాస్పరస్, థయామిన్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే పంది మాంసం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. గొడ్డు మాంసం, గొర్రె వంటి ఇతర ఎర్ర మాంసాల కంటే ఇందులో ఎక్కువ థయామిన్ ఉంటుంది. ఈ మాంసం తింటే కండరాల పెరుగుదల, బరువు తగ్గడం, అధిక రక్తపోటు నివారణ, క్యాన్సర్ అండ్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

పంది మాంసం గొడ్డు మాంసం వంటి పోషకాలను అందిస్తుంది. మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో పచ్చి మాంసం లేదా ఉడికించని మాంసం అస్సలు తినొద్దు. ఒకవేళ తిన్నట్లైతే ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. అలాగే సరిగ్గా ఉడకని పంది మాంసం తింటే మెదడులో సజీవ పురుగులు నివసించి అనారోగ్యానికి కారణమైందని మరోసారి నిరూపితమైంది.

వివరాల్లోకెళ్తే.. అమెరికాకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి గత 4, 5 నెలలుగా విపరీతమైన తలనొప్పితో బాధడుతున్నాడు. ఆ నొప్పి భరించక హాస్పిటల్ కు వెళ్లగా.. డాక్టర్లు రోగి తలను స్నాన్ చేశారు. దీంతో అతడి మెదడులో టేప్ వార్మ్ లు గూడ్ కట్టుకున్నట్లు గుర్తించి వైద్యులు షాక్ అయ్యారు. దీనిపై పేషెంట్ ను అడగ్గా.. పంది మాంసం ఎక్కువగా తింటానని తెలిపాడు. పురుగులు గుడ్లు పెట్టి తలలో గూడు కట్టుకోవడానికి ఉడకని పంది మాంసం తినడమే కారణమని డాక్టర్లు వెల్లడించారు. న్యూరోసిస్టిసెర్కోసిస్ అనే పరాన్నజీవి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడని అన్నారు.

ఇది శరీరంలోని అనేక ప్రాంతాలకు సోకే పరాన్నజీవి గుడ్లు పెట్టే శాస్త్రీయ పదం. ప్రస్తుతం పేషెంట్ ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తీసుకెళ్లారట. అతని మెదడులో వాపును తగ్గించడానికి కార్టికోస్టెరాయిడ్ డెక్సామెథాసోన్‌ను రోజుకు నాలుగు సార్లు ఇస్తున్నారట. అతనికి రెండు వారాల పాటు వార్మ్ ఇన్ఫెక్షన్‌ల చికిత్సకు ఉపయోగించే అల్బెండజోల్ అండ్ ప్రాజిక్వాంటెల్ అందిస్తున్నారు. ఫలితంగా మెదడులోని సిస్ట్‌లు మాయమై, మైగ్రేన్‌లు మెరుగుపడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed