- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
TG Govt: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ.. ఉత్తర్వులు జారీ
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల(Govt Employee Problems) పరిష్కారానికి కాంగ్రెస్ సర్కారు(Congress Govt) కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committee)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి(CS Shanthi Kumari) ఉత్తర్వులు(Orders Issued) జారీ చేశారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు(Govt Employees), గెజిటెడ్ అధికారులు(Gazetted Officers), ఉపాధ్యాయులు(Teachers), కార్మికులు(Workers), పెన్షనర్ల(Pensioners) ఆధ్వర్యంలోని జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) లేవనెత్తిన సమస్యలను పరిష్కారం దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Batti Vikramarka) ఆధ్వర్యంలో ఇద్దరు మంత్రులతో కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కమిటీలో భట్టి విక్రమార్క చైర్మన్(Chairman) గా ఉండగా.. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Sridhar Babu Duddilla), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) సభ్యులు(Membres)గా ఉన్నారు. అలాగే ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు(Keshava Rao.K) కమిటీలో ప్రత్యేక అతిథిగా ఉన్నారు. అంతేగాక ఒక ప్రభుత్వ కార్యదర్శి ఈ కమిటీకి మెంబర్ కన్వీనర్ గా ఉంటారు. ఈ కేబినెట్ సబ్ కమిటీ సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక(Report) అందజేయనున్నారు. ఇక ఈ కేబినేట్ సబ్ కమిటీకి సంబంధించిన సమావేశాలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు(Special Chief Secretaries) సంబంధిత శాఖల ప్రిన్సిపాల్ సెక్రటరీలు(Principal Secretaries) హాజరవుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.