పెండింగ్ వేతనాల కోసం పంచాయతీ కార్మికుల ధర్నా

by Aamani |
పెండింగ్ వేతనాల కోసం పంచాయతీ కార్మికుల ధర్నా
X

దిశ,ఆదిలాబాద్ : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ సీఐటీయు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు.అంతకు ముందు సంఘం కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.అనంతరం సంఘం జిల్లా నాయకుడు ఆశన్న మాట్లాడుతూ..గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని, పెయింటింగ్ వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు.

ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామల దేవికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. 6 నెలల నుండి వేతనాలు రాక చాలీ చాలని వేతనాలతో పని చేస్తూ ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.వెంటనే జీవో నెం.51 ని సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి కేట గిరి వారీగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇంద్రాజ్ అక్కిన పల్లి లక్ష్మన్న,రాజు, రఫీ,మోహన్,అరవింద్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed