TG-Tet Exams: జనవరి 2 నుంచి టెట్ ఎగ్జామ్స్.. అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు ఇవే..!

by Maddikunta Saikiran |
TG-Tet Exams: జనవరి 2 నుంచి టెట్ ఎగ్జామ్స్.. అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు ఇవే..!
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(TG-Tet Exams) వచ్చే నెల జనవరి 2 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ(Application Process) ఇదివరకే ముగియగా.. హాల్ టికెట్లను(Hall Tickets) ఇటీవలే విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgtet2024.aptonline.in/tgtet/ ద్వారా హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ పరీక్షలను రెండు సెషన్లలో కండక్ట్ చేయనున్నారు. సెషన్-1 పరీక్షలు ఉదయం 9.00-11.30 గంటల వరకు, సెషన్2 పరీక్షలు మధ్యాహ్నం 2.00-4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ పరీక్షలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ మేరకు పరీక్ష రాసే అభ్యర్థులకు కీలక సూచనలు(Instructions) చేశారు. ఎగ్జామ్ సెంటర్(Exam Center)లోకి గంటన్నర ముందే అభ్యర్థులను అనుమతిస్తామని, పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు గేట్లను(Gates) క్లోజ్ చేస్తామని తెలిపారు. అభ్యర్థులు తప్పని సరిగా హాల్ టికెట్ తో పాటు బ్లాక్/ బ్లూ(Blue/Black) బాల్ పాయింట్ పెన్, ఏదైనా ఒక ఒరిజినల్ ఐడీ కార్డు(ID Card) తమ వెంట తీసుకెళ్లాలి.అలాగే ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షకేంద్రం లోపలికి తీసుకెళ్లడానికి వీలు లేదు.

Advertisement

Next Story

Most Viewed