TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీలో త్వరలో నగదు రహిత చెల్లింపు విధానం

by Ramesh Goud |
TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. టీటీడీలో త్వరలో నగదు రహిత చెల్లింపు విధానం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) నందు త్వరలో అన్ని సేవలకు నగదు రహిత చెల్లింపు విధానాన్ని(Online Payments) తీసుకురానున్నట్లు టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు(TTD Chairman BR Naidu) తెలిపారు. ఇప్పటికే తిరుమలలో నగదు రహిత చెల్లింపులకు కియోస్క్ మిషన్లు(Kiosk Missons) ఏర్పాటు చేశారు. వీటితో 50 రోజుల్లో 55 లక్షలు విరాళాలు వచ్చాయని బీఆర్ నాయుడు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన.. అన్న ప్రసాదం ట్రస్టుకు భక్తులు రూ.1 నుండి రూ.లక్షలోపు విరాళం ఇచ్చే అవకాశం ఉందని, తిరుమల(Thirumala)లోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్ మిషన్లు(సెల్ఫ్ ఆపరేటెడ్ ఆన్ లైన్ పేమెంట్) (Self Operated Online Payment)టీటీడీ ఏర్పాటు చేసిందని తెలిపారు.

అలాగే ఈ మిషన్ల ద్వారా అన్న ప్రసాదం ట్రస్టుకు 50 రోజుల్లో రూ.55 లక్షలు విరాళం అందినదని, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్ట కోదండ రామాలయం, బెంగుళూరులో శ్రీవారి ఆలయంలో కూడా మిషన్లు ఏర్పాటు చేశామని, ఈ మూడు ఆలయాల్లో ఈ మిషన్ల ద్వారా 15రోజుల్లో అందిన రూ.5 లక్షలు విరాళం అందిందని చెప్పారు. అంతేగాక ఇవాళ పేరూరు సమీపంలోని శ్రీ వకుళామాత ఆలయంలో కూడా ఈ కియోస్క్ మిషన్ ను ఏర్పాటు చేశామని, మరో వారం రోజుల్లో విజయవాడ, చెన్నై, హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయాల్లో కియోస్క్ మిషన్లను భక్తులకు అందుబాటులో తీసుకురానున్నామని తెలిపారు. ప్రస్తుతం అన్న ప్రసాదం ట్రస్టుకు మాత్రమే విరాళం ఇచ్చే అవకాశం ఉందని, త్వరలో టీటీడీ ఆలయాల్లోని అన్ని సేవలకు ఈ మిషన్ల ద్వారా నగదు రహిత చెల్లింపు చేసే విధానాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకురానున్నదని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed