Bridge of Mirrors: కన్యాకుమారిలో అద్భుతం.. దేశంలోనే మొట్టమొదటి అద్దాల వంతెన ప్రారంభం

by Shiva |   ( Updated:2024-12-31 06:19:10.0  )
Bridge of Mirrors: కన్యాకుమారిలో అద్భుతం.. దేశంలోనే మొట్టమొదటి అద్దాల వంతెన ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలోని కన్యాకుమారి (Kanyakumari)లో రూ.37 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫైబర్ గ్లాస్ వంతెన (Bridge of Mirrors)ను సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. అయితే, వంతెన పొడవు 77 మీటర్లు కాగా.. వెడెల్పు 10 మీటర్లుగా ఉంది. సరిగ్గా స్వామి వివేకానంద (Vivekananda) స్మారక స్థూపం నుంచి 133 అడుగుల ఎత్తైన తిరువళ్లువర్ (Tiruvalluvar) విగ్రహ ప్రాంతాలను కలుపుతూ.. ఈ అద్దాల వంతెనను నిర్మించారు. కాగా, వివేకానంద స్మారక మండపానికి 77 మీటర్ల దూరంలో 2000 సంవత్సరంలో అప్పటి తమిళనాడు సీఎం కరుణానిధి (Former CM Karunanidhi) హయాంలో తిరువళ్లువర్‌ (Tiruvalluvar) విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అయితే, ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగి జనవరి 1తో 25 ఏళ్లు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని రెండు రోజుల పాటు తమళినాడు సర్కార్ (Tamilnadu Government) రజతోత్సవాలు నిర్వహించనుంది.

Advertisement

Next Story

Most Viewed