- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొసళ్ల మధ్యలో హాహాకారాలు పెడుతూ నదిలో బాలుడు..
దిశ, వెబ్‌డెస్క్ః మొసళ్లను దూరం నుండి చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది, ఓ బాలుడు మొసళ్ల గుంపు మధ్యలో లోతైన నదిలో మునిగిపోతుంటే.. ఆ సన్నివేశం ఊహించుకుంటేనే గుండె ఆగినంత పనవుతుంది. అయితే, ఈ ఊహను నిజం చేస్తూ ట్విట్టర్‌లో ఒక వీడియో వెలువడింది. భయంగొలిపే ఈ చిల్లింగ్ వీడియోలో, ఒక చిన్న పిల్లాడు నురగలు కక్కుతున్న నది ప్రవాహంలో మునిగిపోతూ ప్రాణాల కోసం పోరాడుతున్నట్లు కనిపిస్తాడు. ఏదో ఒకవిధంగా తనను తాను రక్షించుకునేందుకు భారీగా ప్రవహించే నదిలో హాహాకారాలు పెడుతూ బాలుడు తేలుతూనే ఉన్నాడు. అదే సమయంలో, అతని చుట్టూ మొసళ్ళు కూడా తిరుగుతుంటాయి. అయితే, మునిగిపోతున్న బాలుడిని రక్షించడానికి రెస్క్యూ టీమ్ వెంటనే మోటర్ బోట్‌లో వస్తుంది. ఒకవైపు మొసళ్లను అదిలిస్తూనే, మరోవైపు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందం బాలుడిని మొసళ్ల బారిన పడకుండా పడవలోకి లాక్కుంటారు.
ఈ వీడియో చంబల్ నదికి చెందినదని చాలా మంది వినియోగదారులు క్లెయిమ్ చేసినప్పటికీ, ఖచ్చితమైన లొకేషన్‌పైన స్పష్టత లేదు. ఈ క్లిప్‌ను యూపీ పోలీసు అధికారి సచిన్ కౌశిక్ షేర్ చేశారు. వీడియోను పంచుకుంటూ, "ఇది సినిమా లాంటి నిజమైన దృశ్యం! ఈ పిల్లవాడు చంబల్ నదిలో మునిగిపోతుంటే, వెనుక మొసళ్ళు ఉన్నాయి. రెస్క్యూ టీమ్ సరైన సమయానికి చేరుకుని బాలుడిని చేయిపట్టుకుని లాగింది. సెల్యూట్!" అని క్యాప్షన్ ఇచ్చారు.