- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral News : పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన బిందీ

దిశ, వెబ్ డెస్క్ : పచ్చని కాపురంలో బిందీ రేపిన చిచ్చు(Bindi Issue) చివరికి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేలా చేసింది. అన్యోన్యంగా ఉండాల్సిన భార్యభర్తలు తీవ్ర గొడవ పడగా.. పోలీసులు విశ్వప్రయత్నం చేసి మళ్ళీ వారిని ఒక్కటి చేసి కథ సుఖాంతం అనిపించారు. ఇంతకీ ఏం జరిగింది అంటే.. ఉత్తరప్రదేశ్(UP)లోని ఆగ్రా(Agra) జిల్లాలోని సికంద్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఎనిమిది నెలల క్రితం ఇరాదత్‌నగర్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత, భార్య బిందీలు ధరించడం, తరచుగా మార్చుకోవడం చేసేది. ఇదేమని అడిగితే.. ఇంటి పని చేస్తున్నప్పుడు బిందీ పోతుందని, అందుకే మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తోందని భర్తకు చెప్పేది. అయితే ఆమె రోజుకు చాలాసార్లు భార్య బిందీ మార్చుకుంటోందని గుర్తించిన భర్త, అది లెక్కపెట్టడం ప్రారంభించాడు. తన భర్త రోజుకు ఎన్ని సార్లు బిందీ మార్చుకుంటున్నానో లెక్కపెట్టడం ఆమెకు తీవ్ర కోపం తెప్పించింది. దీనిపై భార్య భర్తల మధ్య తీవ్ర గొడవ జరిగి, ఆమె ఇంటిని విడిచి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది.
మూడు నెలల అనంతరం పోలీసులను ఆశ్రయించి భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇరువురిని స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. అయితే, ఇది పెద్ద సమస్య కాదని భావించిన వారు ఈ కేసును కుటుంబ సలహా కేంద్రానికి తరలించారు. కుటుంబ సలహా కేంద్రంలో కౌన్సెలింగ్ సమయంలో, భార్య తనకు బిందీలు మార్చుకోవడం ఎంతో ఇష్టమని తెలిపింది. భర్త తాను లెక్కపెట్టడం వల్ల ఆమె బాధపడుతోందని గుర్తించి, ఇకపై అలాంటి పని చేయనని ఒప్పుకున్నాడు. ఇరువురు రాజీ పడి, కలిసిపోవాలని నిర్ణయించుకున్నారు. చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు.. బిందీల వలన తీవ్ర గొడవ.. పోలీస్ స్టేషన్ కు వెళ్ళి.. కౌన్సిలింగ్ తో బయట పడ్డారు ఆ భార్య భర్తలు.