ఎండలు ఎక్కువ ఉంటేనే మార్కులు తక్కువ వస్తున్నాయా?.. ఇంట్రెస్టింగ్ టాపిక్..

by Indraja |
ఎండలు ఎక్కువ ఉంటేనే మార్కులు తక్కువ వస్తున్నాయా?.. ఇంట్రెస్టింగ్ టాపిక్..
X

దిశ, ఫీచర్స్: క్లైమేట్ క్రైసిస్ అన్ని రంగాలపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. గ్లోబల్ వార్మింగ్ సాధారణ జనానికి అనేక రకాలుగా నష్టం చేకూరుస్తుంది. ఈ క్రమంలోనే మండుతున్న ఎండలు విద్యార్థుల పెర్ఫార్మెన్స్ పై కూడా ఎఫెక్ట్ చూపుతున్నాయని వరల్డ్ బ్యాంక్ తాజా అధ్యయనం తెలిపింది. ఆఫ్రికా(ఇథియోపియా)లో జరిపిన స్టడీలో ఈ ఫలితాలు వెలువడ్డాయి.

2003 నుంచి 2019 వరకు జరిగిన ఇథియోపియన్ హైయర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సర్టిఫికేట్ డేటాను పరిశీలించిన శాస్త్రవేత్తలు దాదాపు 2.47 మిలియన్ స్టూడెంట్ డేటాను అనలైజ్ చేసి ఈ విషయాన్ని గుర్తించారు. ఈ టైం పీరియడ్ లో స్కూల్ లెవెల్ టెంపరేచర్, నంబర్ ఆఫ్ హాట్ డేస్, కాలేజ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు లీడ్ రీసెర్చర్ పాట్రిక్ బెహెరార్.

ఒకే స్కూల్ లో వివిధ అకాడమిక్ ఇయర్ కు చెందిన విద్యార్థుల రిజల్ట్ కంపేర్ చేశామని.. ముఖ్యంగా పరీక్ష రోజున అధిక ఎండ తీవ్రతకు గురైన స్టూడెంట్స్ కూలర్ క్లైమేట్ కు ఎక్స్ పోజ్ అయిన వారితో పోలిస్తే వరెస్ట్ గా రాశారని తెలిపారు. ఏడాదిలో ఎక్కువ ఎండను ఫేస్ చేసిన విద్యార్థులు.. తక్కువగా నేర్చుకోగలిగారని, అడిషనల్ గా పది రోజులు ఎండ ఎక్కువ ఉన్నట్లయితే పెర్ఫార్మెన్స్ లో 2.28% తగ్గినట్లు వెల్లడించారు. ఇక ఈ ప్రభావం అమ్మాయిలపై అంతగా లేదని వివరించారు శాస్త్రవేత్తలు.

Advertisement

Next Story

Most Viewed