కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమే గురు! ఏకంగా నడి రోడ్డుపైనే ఇఫ్తార్!

by Ramesh N |   ( Updated:2024-04-02 12:42:04.0  )
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమే గురు! ఏకంగా నడి రోడ్డుపైనే ఇఫ్తార్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముస్లింలకు పరమ పవిత్రమైనది రంజాన్ మాసం. ఈ నేపథ్యంలోనే ముస్లింలు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తుంటారు. ఇఫ్తార్ విందు మైదాన ప్రదేశాలు, ఫంక్షన్ హాల్స్, హోటల్స్ లాంటి ప్రాంతాల్లో ఇఫ్తార్ ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఇందుకు భిన్నంగా కర్నాటకలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించిన తాజాగా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంఘగళూరులోని ముడిపు జంక్షన్‌లో మెయిన్ రోడ్డులో ఒకవైపు రోడ్డు బ్లాక్ చేసి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. పబ్లిక్, వాహనదారులకు ఇబ్బందులకు గురి చేస్తూ.. రోడ్డు బ్లాక్ చేసి ఇఫ్తార్ విందు ఇవ్వడం ఏమిటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇఫ్తార్ ఇవ్వడానికి వేరే ఖాళీ ప్లేస్ దొరకలేదా? అని, కాంగ్రెస్ రూల్ చేసే స్టేట్‌లో ఏదైనా సాధ్యమేనని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Advertisement

Next Story