- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏఐను ఉపయోగించి కోతుల్ని తరిమిన అమ్మాయికి ఆనంద్ మహీంద్రా ఉద్యోగం ఆఫర్
దిశ, వెబ్‌డెస్క్: సాంకేతిక పరిజ్ఞానంతో తన చెల్లిని కోతుల దాడి నుంచి కాపాడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బస్తీలోని ఆవాస్ వికాస్ కాలనీలో ఉంటోన్న నికిత (13) ఇంట్లోకి కోతులు వచ్చి భయాందోళన సృష్టించగా.. తను అలెక్సాను కుక్కలా మొరుగమని వాయిస్ ఓవర్ ఇచ్చింది. అలెక్సా నుంచి కుక్క మొరిగిన సౌండ్ రావడంతో కోతులు ఇంట్లో నుంచి పారిపోయాయి. నికిత తన 15 నెలల తన సోదరిని ఎంతో తెలివిగా కాపాడటంతో నెటిజన్లు ఈమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ సమయంలో నికితకు ఈ ఆలోచన రావడం నిజంగా గొప్ప విషయం అంటూ కొనియాడుతున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌తో ముప్పు పొంచి ఉంటుందని కొందరు హెచ్చరిస్తున్నారు. కానీ అదే ఏఐను తెలివిగా వాడుకుంటే మన ప్రాణాలు కాపాడుతుందని ఈ టాలెంటెడ్ అమ్మాయి నిరూపించింది. కోతుల దాడి నుంచి తన సోదరిని కాపాడిన నికితకు మహీంద్రా గ్రూప్ చెర్మైన్ ఆనంద్ మహీంద్రా ఉద్యోగం ఆఫర్ ఇచ్చాడు. అమ్మాయి స్టడీ కంప్లీట్ అయ్యాక జాబ్ కావాలని కోరుకుంటే మహేంద్ర కంపెనీలో జాబ్ ఇస్తానని ఆయన ప్రకటించారు. సాహసోపేతమైన చర్యకు ఫిదా అయిన ఆనంద్ మహీంద్ర నికితను పొగడ్తలతో ముంచెత్తుతూ.. 13 ఏళ్ల బాలిక నా మనసు గెలిచింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.