Viral Video: జాతీయ గీతాన్ని క్యూట్‌గా పాడిన బుడ్డోడు.. నెట్టింట ఆకట్టుకుంటోన్న వీడియో

by Anjali |   ( Updated:2024-08-18 12:53:55.0  )
Viral Video: జాతీయ గీతాన్ని క్యూట్‌గా పాడిన బుడ్డోడు.. నెట్టింట ఆకట్టుకుంటోన్న వీడియో
X

దిశ, ఫీచర్స్: ‘జనగణమన అధినాయక జయహే ! భారత భాగ్య విధాతా!’ అని సాగే మన జాతీయ గీతం 1905 లో రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాశారు. 1911 డిసెంబరు 27 వ తారీకున కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభలో ఆయన పాడారు. ఈ జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాకూర్ 5 భాషల్లో చరణాల్లో రచించారు. అయితే ఈ జాతీయ గీతాన్ని ఆలపిస్తుంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇకపోతే ఆగస్టు 15 వ తారీకున దేశవ్యాప్తంగా 78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సెలబ్రేట్ చేసుకొన్న విషయం తెలిసిందే.

కాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ బుడ్డోడు జాతీయ గీతాన్ని ఆలపించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. సరిగ్గా మాట్లాడం రాని, నిలబడం రాని ఈ చిన్న పిల్లోడు విద్యార్థులతో కలిసి జనగణమన అంటూ ఆలపించడం ఎంతో క్యూట్‌గా ఉంది. పదాలు అనడం రాకున్నా అవి పలకాలన్న తపన ఈ బుడ్డోడిలో కనిపిస్తుంది. ఈ వీడియోను హర్ష్ గోయెంకా అండ్ కిరణ్ మజుందార్ సోషల్ మీడియాలో పంచుకోగా ఈ చిన్న పిల్లోడిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ తెగ నవ్వేసుకుంటున్నారు.

Click here for Twitter Video : https://x.com/hvgoenka/status/1823983998340616527

Advertisement

Next Story

Most Viewed