ఓరి నీ వేషాలు.. ముందర పడితే మూతి పగిలేది కదరా నాయనా..

by Sumithra |
ఓరి నీ వేషాలు.. ముందర పడితే మూతి పగిలేది కదరా నాయనా..
X

దిశ, ఫీచర్స్ : ఇది స్టంట్ల యుగం. ప్రతి ఒక్కరూ తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి వివిధ రకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. అంతే కాదు వారు చేసిన స్టంట్లను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇలాంటి వీడియోలను ప్రజలు చూడడానికి ఇష్టపడతారు. అయితే సరదాగా గడుపుతూ ఇలాంటి విన్యాసాలు చేసేవారు కొందరు ఉన్నారు. ప్రస్తుతం ఇలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

చాలామంది ప్రజలు ఎస్కలేటర్ పై వెలుతున్నప్పుడు ఎక్కడ పడిపోతామో అని తెగ భయపడుతూ ఉంటారు. ఇలాంటి వారిని మనం రైల్వేస్టేషన్లలో, షాపింగ్స్ మాల్స్, మెట్రో స్టేషన్, ఎయిర్‌పోర్ట్‌లో చూస్తూ ఉంటాం. కానీ ఓ వ్యక్తి ఎస్కలేటర్ మెట్ల మీద నుంచి కాకుండా ఎస్కలేటర్ సైడ్ లో పడుకుని జారుతూ అతివేగంగా కిందకు దిగుతున్న ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ కుర్రాడు ఈ స్టంట్ చేసిన విధానం చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. ఇది చూసిన తర్వాత ఎవరి ఊపిరి అయినా ఆగిపోతుంది అంటే నమ్మండి. ఈ క్లిప్ చూసిన వారంతా ఇది చాలా ప్రమాదకరమైన స్టంట్ అంటున్నారు. చిన్న తప్పు చేసినా ఆ యువకుడి ప్రాణం క్షణాల్లోనే పోతుందని ఊహించవచ్చు.

ఈ వీడియో @TheFigen అనే ఖాతా ద్వారా Xలో భాగస్వామ్యం చేశారు. 'పొరపాటున పడిపోతే ఇక ఆట ముగిసిపోయింది' అని ఒక వినియోగదారు కామెంట్ చేశాడు. మరొకరు, 'పబ్లిక్ ప్లేస్‌లో ఇంత ప్రమాదకరమైన స్టంట్ ఎవరు చేస్తారు సోదరా ?' అని మరొకరు రాశారు.

Advertisement

Next Story