1000 అడుగుల బోరు బావిలోకి కెమెరా పంపిన వ్యక్తి.. లోపలేముందో చూడాలని ఆసక్తిగా ఉన్నవారు ఈ వీడియో చూడండి!

by Anjali |   ( Updated:2024-08-14 09:35:50.0  )
1000 అడుగుల బోరు బావిలోకి కెమెరా పంపిన వ్యక్తి.. లోపలేముందో చూడాలని ఆసక్తిగా ఉన్నవారు ఈ వీడియో చూడండి!
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ ఎంత స్పీడ్‌గా దూసుకుపోతుందో మనిషి ఆలోచనలు కూడా అంతే వేగంగా దూసుకుపోతున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో జనాల్ని ఆశ్చర్యపరిచే వీడియోలు తీసి పలువురు నెటిజన్లచే వావ్ అనిపించుకుంటారు. అలాంటి వీడియోలు చూస్తే అసలు వారికి ఆ ఆలోచనలు ఎలా వచ్చాయబ్బా అనే సందేహాలు తలెత్తుతాయి. అంతలా ఆకట్టుకుంటాయి మరీ. అయితే తాజాగా ఓ వ్యక్తి వెయ్యి అడుగుల బోరు బావిలోకి కెమెరా పంపి సోషల్ మీడియాలోని ప్రజల్ని షాక్‌కు గురి చేస్తున్నాడు. శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా భూమిపై చాలా రకాల పరిశోధనలు చేస్తున్నారు. కానీ కొన్నింటికి ఇప్పటికీ సరైన సమాధానం లేదు. అలాగే చాలా మందికి భూమి లోపల ఏముంటుందో అని తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది.

కానీ అదేలా సాధ్యమవుతుందని కేవలం ఊహాగానాలతోనే సరిపెట్టుకుంటారు. కానీ రీసెంట్‌గా ఓ వ్యక్తి 1000 అడుగుల బోరు బావిలోకి కెమెరా పంపాడు. ఎలాగైనా బావిలో ఏముందని తెలుసుకోవాలని కోరికతో చిన్న గోప్రో కెమెరాను కిందికి దింపాడు. అయితే కామన్‌గా బోర్‌వెల్‌లో ఉండే ఇనుప కేసింగ్ పైపు వ్యక్తి తలకు సరిపోయేంత వెడల్పుగా ఉంటుంది. కాగా గోప్రో కెమెరాను సహాయం తీసుకున్నాడు. మరీ ఈ వ్యక్తి ఎలా కెమెరాను పంపించాడో ఆ విధానాన్ని వీడియోలో వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఏకంగా 12 లక్షలకు పైగా లెక్ లు రావడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed