- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సోషల్ మీడియాకు కిక్ ఇచ్చిన పెళ్లి జంట.. ఏకంగా QR కోడ్ బోర్డు పెట్టి..!!
దిశ, వెబ్‌డెస్క్ : ఈ మధ్యకాలంలో పెళ్లిలు కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. తమ పెళ్లి అందరికీ గుర్తు ఉండేలా వధువరులు ప్లాన్ చేసుకుంటున్నారు. వింతవింతగా పెళ్లి కార్డులు, వెడ్డింగ్ షూట్స్, శోభనం గది లైవ్.. ఇలా ఎన్నో విడ్డూర పనులు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఓ పెళ్లి జంట వినూత్నంగా ఆలోచించి సోషల్ మీడియాకు కిక్ ఇచ్చింది.
సహజంగా ఫంక్షన్లకు వెళ్లేవారు ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళ్తారు. కొంత మంది నగదును కానుకగా ఇస్తుంటారు. మరికొంత మంది ఖాళీ చేతులతో వచ్చి కడుపు పగిలేలా ఆరగించి బేవురు మంటూ వెళ్లిపోతారు. ఇలాంటి వారి కోసమే ఈ నవ జంట ఆలోచించింది. తిని వెళ్లడం కాదు.. మా జంటని ఆశీర్వదించి.. కానుకలు చెల్లించి మాకు చేయూతనివ్వాలని కోరుకుంది. ఇందుకుగాను రిసెప్షన్ వేధిక ముందు QR కోడ్ బోర్డును ఏర్పాటు చేసింది. విందుకు వచ్చిన అతిథులు, బంధుమిత్రులు ఆ జంటను దీవించడంతోపాటు ఆ QR కోడ్ ద్వారా నగదును బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.