- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగరంగ వైభవంగా బాత్‌రూమ్‌లో పెళ్లి చేసుకున్న జంట.. ఎందుకో తెలుసా?
దిశ, ఫీచర్స్: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అదొక అద్భుతమైన ఘట్టం. రెండు జీవితాలను ఒక్కటి చేసి ఎన్ని కష్టాలు ఎదురైనా కలిసి మెలసి జీవించాలని చెప్పే పవిత్ర బంధం వివాహం. అయితే కొందరు పెళ్లిని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలని వెరైటీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటీవల కొత్త ట్రెండ్ కూడా నడుస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందే జంటలు ప్రీ-వెడ్డింగ్ ఫొటో షూట్ చాలా డిఫెరెంట్ ఐడియాతో జరుపుకుంటూ తమ క్రియేటివిటీని బయటపెడుతున్నారు. అంతేకాకుండా పెళ్లిని కూడా అంగరంగ వైభవంగా కొందరు ఆశ్చర్యపోయేలా చేసుకుని వార్తల్లో నిలుస్తున్నారు.
అయితే పెళ్లిళ్ల కోసం బడా ఫంక్షన్ హాళ్లు, రిసార్టులు, ఖరీదైన హోటళ్లు వంటివి వారానికి ముందే బుక్ చేసుకుంటారు. అలాగే అతిథులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు రిచ్‌గా చేస్తుంటారు. కానీ ఓ జంట మాత్రం వెరైటీగా బాత్‌రూమ్‌లో ఏకంగా పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. ఛీ బాత్ రూమ్‌లో పెళ్లి చేసుకోవడమేంటని షాక్ అవుతున్నారా? కానీ మీరు విన్నది నిజమే ఓ జంట ఘనంగా బాత్ రూమ్‌లో వివాహం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కానీ ఇది ఎక్కడ జరిగింది అనేది మాత్రం తెలియదు.
అసలు విషయంలోకి వెళితే.. టియానా అనే యువతి డిస్కో- బాత్ రూమ్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని వరుడు లోజన్‌కు చెప్పడంతో దానికి అతడు కూడా ఒప్పుకున్నాడు. దీంతో వీరి పెళ్లి కోసం బాత్‌రూమ్‌ను కల్యాణ వేదికగా మార్చి కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. రంగురంగుల లైట్స్‌తో, బెలూన్స్‌తో అలంకరించి మరి ఘనంగా వేడుకను జరుపుకున్నారు. అంతేకాకుండా బాత్‌రూమ్‌లోకి వెళ్లే దగ్గర ప్రత్యేక సైన్‌బోర్డును కూడా పెట్టారు.
దాంతో పాటు ఓ నోటును కూడా డోర్ దగ్గర అమర్చారు. డిస్కోలోని బాత్‌రూమ్‌లో పెళ్లి జరుగుతుంది. అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాము’’ అని రాసుకొచ్చారు. టియానా-లోజన్ కపుల్ వైట్ కలర్ డ్రెస్‌లో రాగా.. ఇక వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల బాత్‌రూమ్‌లో వెళ్లగా వారి పెళ్లి ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఈ జంట పెళ్లి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.