- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నమ్మండి..! ఇదీ ఆస్పత్రే.. ఇక్కడ జరుగుతున్నది కరోనా ట్రీట్మెంటే..!!
భోపాల్ : ‘డెబ్బై ఐదేళ్ల స్వతంత్య్ర భారతావని మనది. మనం విశ్వగురువులం…’ అని విర్రవీగుతున్నవాళ్లంతా కళ్లు కొంచెం పెద్దవిగా చేసుకుని చూడండి. పై చిత్రంలో కనిపిస్తున్నదేదో డాక్యుమెంటరీనో లేదా సినిమా షూటింగో కాదు. అదీ తాత్కాలిక ఆస్పత్రే..! అక్కడ జరుగుతున్నది ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు చికిత్సనే..!! భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కారణంగా పట్నం నుంచి పల్లెల దాకా ఆస్పత్రులన్నీ కిక్కిరిసి వైద్య వ్యవస్థ దాదాపు కుప్పకూలుతున్న వార్తలు చూస్తూనే ఉన్నాం.
పట్టణాల్లో అయితే ఆస్పత్రుల్లో బెడ్లు లేక, బెడ్లు దొరికినా ఆక్సిజన్ సిలిండర్లు, ఔషధాలు లేక కొవిడ్ రోగులు పడుతున్న నరకయాతన అంతా ఇంతా కాదు. సకల సౌకర్యాలున్న పట్టణాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మారమూల గ్రామాల్లో అయితే అది నరక సమానం. రూరల్ హాస్పిటల్స్, పీహెచ్‌సీలలో వసతులు లేక గ్రామీణ ప్రాంత ప్రజలకు చెట్ల నీడలే ఆస్పత్రి బెడ్లు అవుతున్నాయి. చెట్టు కొమ్మలు సెలైన్ బాటిల్ వేసుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇంత జరుగుతున్నా అక్కడ వైద్యం చేసేది ఏదైనా స్పెషలిస్టు డాక్టరా..? అంటే అదీ కాదు. అంతా లైసెన్సు కూడా లేని ఆర్ఎంపీలే..
ఈ దారుణం మధ్యప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అగర్-మల్వ జిల్లాలోని ధనియఖేడి గ్రామానికి సమీపంలో ఇలా చెట్ల కిందనే ఆస్పత్రి కాని ఆస్పత్రి ఏర్పాటయింది. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో వైద్య సదుపాయాల కొరత వేధిస్తుండటంతో కరోనా బారిన పడ్డ జనాలను ఇలా చెట్ల కింద కనీసం మంచం కూడా లేకుండా కింద ఒక పెద్ద సంచి వేసి పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. చికిత్స అంటే అదేదో రెమిడెసివిర్‌లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఏర్పాటు చేసి పోషకాహారం అందిస్తున్నారనుకునేరు.
అవసరమైతే జ్వరం మాత్ర, చేతికి సెలైన్ బాటిల్.. అంతే. ఒక్కరికి మాస్కు లేదు. భౌతిక దూరం ఊసే లేదు. కరోనాకు ముందు లక్షణాలు జ్వరం, దగ్గు, జలుబు వంటివి వచ్చినవారు ఆస్పత్రులకు వెళ్లడానికి భయపడి ఇక్కడ చికిత్స పొందుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వారిని స్థానికంగా ఉండే ఆర్ఎంపీలే ట్రీట్ చేస్తు్ండటం గమనార్హం. సుమారు పది గ్రామాల ప్రజలు ఇక్కడ చికిత్స పొందుతున్నారట.. ఇదే విషయమై స్థానిక మెడికల్ ఆఫీసర్‌ను ప్రశ్నించగా.. కొవిడ్ లక్షణాలున్నవారు దయచేసి టెస్టులు చేయించుకుని సరైన చికిత్స పొందాలని కోరారు. ఈ చర్యలకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
#कोरोना के मरीजों की बढ़ती संख्या के कारण स्वास्थ्य सेवाएं बेहाल हैं, सुसनेर में झोलाछाप डॉक्टर पेड़ पर लटाकर मरीज़ों को स्लाइन चढ़ा रहे हैं, गांववाले डरे हैं कि सरकारी अस्पताल में अगर इलाज कराने गए तो कोरोना वार्ड में भर्ती करा दिया जाएगा #CovidIndia #COVIDEmergencyIndia pic.twitter.com/KhsZvxSz8E
— Anurag Dwary (@Anurag_Dwary) May 5, 2021