సూర్యుడు అస్తమించని అందమైన ప్రదేశాలను ఎప్పుడైనా చూశారా..? ఇదిగో ఆ సుందర దృశ్యాలు!

by Sumithra |
సూర్యుడు అస్తమించని అందమైన ప్రదేశాలను ఎప్పుడైనా చూశారా..? ఇదిగో ఆ సుందర దృశ్యాలు!
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ విశ్వంలో ఎన్నో అద్భుతాలు, వింతలు, రహస్యాలు దాగి ఉన్నాయి. విశ్వంలో జరిగే ఎన్నో అద్భుతమైన విషయాలు మనల్ని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. నిజానికి మనకు ప్రతిరోజూ కనిపించే సూర్యోదయం, సూర్యాస్తమయం ఒక అద్భతమే. వీటి ద్వారానే మనం సమయాన్ని తెలుసుకోగలుతున్నాం. అలాగే సీజన్‌ను బట్టి సూర్యోదయం, సూర్యాస్తమయం కాస్త ఆలస్యంగా, తొందరగా జరగుతాయి. కానీ కొన్ని దేశాల్లో అసలు సూర్యుడు అస్తమించడట. అక్కడ ఎప్పుడూ సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడట. వింటుంటే కాస్త వింతగా అనిపించినా అది మాత్రం ముమ్మాటికి నిజం. ఆర్కిటిక్ సర్కిల్‌లో ఉండే ప్రదేశాల్లో ఈ అద్భుతం జరుగుతుంది. ఇంతటి అద్భుతమైన ప్రదేశాలను సందర్శించడానికి ఎంతో మంది టూరిస్టులు ఆయా దేశాలకు వెళుతూ ఉంటారు. అంతే కాదు ఆ ప్రాంతానికి వచ్చే టూరిస్టులు రాక్ క్లైంబింగ్, హార్స్ రైడింగ్, బోటింగ్ లు చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతటి అద్భుతమైన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి, ఏదేశంలో సూర్యుడు అస్తమించకుండా ఉంటాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐస్లాండ్..


చాలా మంది టూరిస్టులు వేసవిలో విరామం కోసం ఐస్లాండ్ వెళతారు. ఈ ఐస్లాండ్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మధ్య రాత్రి 12 గంటలకు కూడా సూర్యరశ్మి భూమిపై ప్రసరిస్తూ ఉంటుంది. రాత్రి సమయంలో కూడా సూర్యుడు ఉదయించి ఉంటాడు. ఈ ప్రాంతం ఆర్కిటిక్ సర్కిల్ కు చేరువలో ఉండడంతో ఈ అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. అంతే కాదు ఈ ఐస్లాండ్‌లో హిమనీ నదాలు, నీటి బుగ్గలు, అగ్నిపర్వతాలు, జలపాతాలు చూపరులను కనువిందు చేస్తాయి. ఇక్కడ క్యాంపింగ్, డైవింగ్ లు కూడా చేయవచ్చు.

కెనడా..


కెనడా ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం. కెనడాలోని ఇనువిక్, వాయువ్య భూభాగాలలో వేసవి సమయంలో 50 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. రాత్రి సమయంలో కూడా సూర్యుడు ఉదయించి వెలుతూరు ఇస్తాడు. అలాగే ఇక్కడ చాలా ప్రదేశాలు మంచుతో కప్పబడి ఉంటాయి. ఇంతటి అద్భుతమైన ప్రదేశాలను చూడటానికి ఇక్కడికి వేల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. అలాగే కెనడాలోని కొన్ని ప్రాంతాల్లో వేడి నీటి బుగ్గలు, చారిత్రక స్మారక చిహ్నాలను చూడవచ్చు.

నార్వే..


రాత్రి వేళల్లో సూర్యుడు అస్తమించని ప్రాంతాల్లో నార్వే కూడా ఒకటి. ఈ దేశాన్ని మిడ్‌నైట్ సన్, సూర్యుని భూమి అని కూడా పిలుస్తారు. వాయువ్య యూరోపియన్ దేశంలోని ఆర్కిటిక్ సర్కిల్‌లో ఈ ప్రాంతం ఉంది. అలాగే ఈ ప్రాంతం ఎక్కువ ఎత్తులో ఉండడంతో ఈ దేశంలో సూర్యకాంతి నేరుగా పడుతుంది. అంతే కాదు మనదేశంలో లాగా అక్కడ చాలా వరకు సూర్యుడు అస్తమించడు, చీకటి పడదు. అందుకే అక్కడ రాత్రి, పగలు సూర్యరశ్మి ఎప్పుడు ప్రసరిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మే నుండి జూలై వరకు 24 గంటలు సూర్యుడు ఉదయించే ఉంటాడు.

ఫిన్లాండ్..


ఫిన్లాండ్‌లో వేసవి సమయంలో 73 రోజుల పాటు సూర్యుడు అస్తమించకుండా ఉంటాడు. అర్ధరాత్రి 12 గంటలకు కూడా అక్కడి ప్రజలు వారి పనులను చేసుకుంటారు. అలాగే ఇక్కడ వెయ్యి సరస్సులు, ద్వీపాలు కూడా ఉన్నాయి. ఈ అద్భుతమైన ప్రదేశాన్ని వీక్షించేందుకు సందర్శకులు వేలల్లో వస్తుంటారు. ఇక్కడ అర్థరాత్రుల్లు కూడా రాక్ క్లైంబింగ్, హైకింగ్, ట్రెక్కింగ్‌లు చేస్తూ ఉంటారు.

Advertisement

Next Story