క్షుద్రపూజలకు కేరాఫ్ ఆ గ్రామం.. ఇంటి ముందే ఆత్మలు, దయ్యాలు!

by Sumithra |
క్షుద్రపూజలకు కేరాఫ్ ఆ గ్రామం.. ఇంటి ముందే ఆత్మలు, దయ్యాలు!
X

దిశ, వెబ్‌డెస్క్ : మనం కొన్ని సినిమాలు, సీరియల్లలో దేవుళ్లని, అలాగే దయ్యాలని చూస్తూ ఉంటాం. కేవలం చిత్రాల్లో మాత్రమే కాదు నిజజీవితంలో కూడా దేవుడు, దయ్యాలు ఉన్నాయని చాలా మంది నమ్మతుంటారు. చిన్న చిన్న గ్రామాల్లో మనిషిలో దేవుడు పూనాడు, దయ్యం పట్టింది అంటూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు దేవుడు, దయ్యాన్ని ఎవరూ కూడా ప్రత్యక్షంగా చూసింది లేదు. వేదమంత్రాలు నేర్చుకున్న పూజారులు, పండితులు దేవుళ్లని ఆరాధిస్తే, క్షుద్ర మాంత్రికులు దెయ్యాలను ఆరాధిస్తారు. అయితే మన భారత దేశంలో క్షుద్రపూజలు చేసేవారికే ప్రత్యేకంగా ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఏ ఇంట్లో చూసినా క్షుద్రపూజలు చేసే వారే కనిపిప్తారు. వింటుంటేనే విచిత్రంగా ఉంది కదా.. మరి ఆ గ్రామం ఎక్కడ ఉంది, ఆ గ్రామంలో ఎందుకు క్షుద్రపూజలు చేస్తారు.. ఆ వివరాలను తెలుసుకుందాం.

అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో మయోంగ్ అనే ఓ గ్రామం ఉంది. ఇది గౌహతి నగరం నుండి దాదాపు 40 కిమీ దూరంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతంలో మా ఎర్ ఆంగో అనే దేవత ఇక్కడ ఉండేదట. ఆమె పేరుమీదే మయోంగ్ అన్న పేరు వచ్చినట్లు కొంతమంది చెబుతారు. అలాగే ఈ ప్రాంతంలో మౌచోంగ్ వంశానికి చెందిన నివసించేవారని వారి పేరుమీదే మయోంగ్ అని పేరువచ్చిందని మరో కథనం ప్రచారంలో ఉంది. ఇది ఓ పర్యాటక ప్రాంతం. ఇక్కడి ప్రకృతి, వణ్యప్రాణులు, కొండలు, పచ్చటి అటవీ ప్రాంతం ఇక్కడికి వచ్చే పర్యాటకుల మదిని దోచేస్తాయి. అలాగే ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అది ఏంటంటే ఈ ప్రాంతం చేతబడి, బాణామని, మాయాలు, మంత్రాలకు కూడా ఎంతో ప్రాముఖ్యం చెందినది. మయోంగ్ ను భారతదేశ చేతబడి రాజధాని అని అంటారు.

మయోంగ్ గ్రామంలో చేతబడి, క్షుద్రపూజలు చేసేవారు దాదాపుగా 100 మంది ఉన్నారట. ప్రతి ఇంటి నుంచి ఒకరైనా చేతబడి నేర్చుకోవడం వంశపార్యంపర్యంగా వస్తుందట. క్షుద్ర పూజలను నేర్చుకొనేవారిని బెజ్ లేదా ఒజా అని పిలుస్తారట. ఇప్పటి యువతరానికి కూడా క్షుద్రపూజలను వారి ఇంట్లో ఉండే పెద్దవారు నేర్పిస్తూ ఉంటారట. ఎవరైతే చేతబడి నేర్చుకుంటారో వారికి ఆత్మలు సహాయపడాయని చెబుతారు. క్షుద్రపూజల వల్ల అతీత శక్తులు లభిస్తాయని ఇక్కడి ప్రజల నమ్మకం. ఆ శక్తులతో ప్రపంచాన్నే జయించవచ్చునని విశ్వసిస్తారు. అతీత శక్తులను వశం చేసుకోవడానికి సంవత్సరాల తరబడి శ్మశానాల్లోనే గడిపేవారు కూడా ఉన్నారని చెబుతారు.

ఇక్కడి ప్రజలు క్షుద్రపూజల ద్వారా అనారోగ్యం పాలైన వారిని కూడా ఆరోగ్యవంతులుగా చేస్తారట. వెన్నునొప్పితో బాధపడుతూ ఇక్కడికి వవ్చేవారి వీపు పై కంచుతో చేసిన ప్లేటును ఉంచుతారట. అలా పెట్టి కొన్ని మంత్రాలు పఠిస్తే వెన్ను నొప్పి తగ్గిపోతుందని చెబుతారు. ఈ గ్రామంలోకి ప్రవేశించగానే ప్రతి ఇంటి ముందు పక్షులు, జంతువుల కళేబరాలు కనిపిస్తాయి. ఏ మాంత్రికుని ఇంటిముందు ఎక్కువ కళేబరాలు ఉంటే వారు అంత పేరుగాంచిన మాంత్రికుడని నమ్ముతారు. ఇక్కడ చాలావరకు క్షుద్రపూజలకు వినియోగించే వస్తువులనే ప్రదర్శనలో పెడతారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు మ్యూజియంను సందర్శించవచ్చు. భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఈ గ్రామాన్ని సందర్శిస్తారు.

Advertisement

Next Story

Most Viewed