- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరాబాద్ లో కొత్త జర్నీ
దిశ, న్యూస్ బ్యూరో:
నగరవాసులు మెట్రో రైల్ ప్రయాణంతో కొత్త అనుభూతి పొందారు. త్వరలో మరో సరికొత్త ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇంధనం ఆదా, పర్యావరణహితంగా ఉండే ‘ట్రామ్ సర్వీసు’లను హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సర్కారు అనుమతి లభిస్తే ట్రామ్ సర్వీసులను ప్రారంభించిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.
ఆర్టీసీ, రైల్వే వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థల తర్వాత చౌకగా, వేగవంతమైన ప్రయాణ సాధనాలను అందుబాటులోకి తెచ్చేందుకు నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుతూ, ఎక్కువ మందికి రవాణా సదుపాయాన్ని అందించేందుకు హైదరాబాద్ మెట్రో సర్వీసులను ప్రారంభించారు. మెట్రో ద్వారా నిత్యం 4 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మెట్రో రైళ్లు విద్యుత్‌తో నడుస్తున్నాయి. మరోవైపు ఎలివేటేడ్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం అందుబాటులోకి తెచ్చేందుకు వేగంగా ప్రణాళికలు వేస్తున్నారు. దీనికి సమాంతరంగా ట్రామ్ సర్వీసులను ప్రారంభిస్తే ఎలా ఉంటుందోననే అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ట్రామ్ సర్వీసులు విద్యుత్ లేదా రీఛార్జి బ్యాటరీలతో పనిచేస్తుండటం వల్ల కాలుష్యం తీవ్రత తక్కువగా ఉంటుంది.
దేశంలోనే రెండో రాష్ట్రంగా
ట్రామ్ సర్వీసులు అందుబాటులోకి వస్తే ఈ సర్వీసులను అందిస్తున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల్లో చేరనుంది. ప్రస్తుతం దేశంలోనే ట్రామ్ సర్వీసులను అందిస్తున్న ఏకైక నగరంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా ఉంది. గతంలో ముంబై, నాసిక్, చెన్నై, కాన్పూర్, కేరళ, ఢిల్లీ, పాట్నా ప్రాంతాల్లో ట్రామ్ సర్వీసులను అందించినా ఆ తర్వాత కాలంలో అన్నింటిని మూసివేశారు. ప్రస్తుతం కోల్‌కతా మినహా దేశంలో ఎక్కడా ట్రామ్ సర్వీసులు లేవు. కోల్‌కతా ట్రామ్ వే కంపెనీ అందిస్తున్న ఈ సర్వీసులు దేశంలోనే పురాతనమైనవి. రూ. 240 కోట్లతో అక్కడి ట్రామ్ సర్వీసులను అప్‌గ్రేడ్ చేయాలని సదరు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలో కూడా ట్రామ్ వే సర్వీసులను అందుబాటులోకి తెస్తే ప్రజలకు అత్యంత సౌలభ్యవంతమైన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. పర్యావరణహితంగా ఉండటంతోపాటు శబ్ద కాలుష్యం కూడా తక్కువగా ఉంటుంది.
విద్యుత్ సాయంతో నడిచే ట్రామ్ సర్వీసులు నగరంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా కనిపిస్తున్నాయి. మెట్రో తరహాలోనే ఎక్కువ భూమి అవసరం లేకుండా ట్రామ్ సర్వీసులను నడిపించవచ్చు. రైల్ పట్టాల మాదిరిగా ఉండే రెండు లైన్లపై ఇవి ప్రయాణిస్తాయి. వెహికల్ వెళ్లేంత స్థలం ఉన్నా ఎక్కడి నుంచైనా ఈ ట్రాక్ వేసుకోవచ్చు. ట్రామ్ బస్సులు వెళ్లని సమయాల్లో యథావిధిగా ట్రాక్ మీద నుంచి రాకపోకలు కొనసాగించవచ్చు. సాధారణంగా ఇలాంటి దృశ్యాలు విదేశాల్లోని కూరగాయాల మార్కెట్లు, రద్దీగా ఉండే జంక్షన్లలో కనిపిస్తాయి. త్వరలోనే నగర ప్రజలకు ట్రామ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
tags : Metro, travel, pollution, Hyderabad, ts Govt