- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
12వ తేదీ నుంచి ట్రైన్‌లు షురూ
న్యూఢిల్లీ: ఈ నెల 12వ తేదీ నుంచి ట్రైన్ సేవలను ఇండియన్ రైల్వే అంచెలంచెలుగా ప్రారంభించనుంది. తొలుత 15 జతల ప్యాసింజర్ ట్రైన్‌లతో సేవలను పునరుద్ధరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ ప్రత్యేక ట్రైన్‌లు.. న్యూఢిల్లీ స్టేషన్ నుంచి దిబ్రుగఢ్, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పుర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మాడగావ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్ము తావిల మార్గాలను అనుసంధానం చేస్తూ సేవలను ప్రారంభించనున్నాయి. ఈ 15 జతల ట్రైన్‌లు సేవలు ప్రారంభించాక.. భారతీయ రైల్వే.. మరిన్ని ట్రైన్‌లను ఇంకొన్ని కొత్త రూట్‌లలో ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నది. కొవిడ్ 19 కేర్ సెంటర్‌లకు 20,000 బోగీలు, వలస జీవులకు ప్రతిరోజు కేటాయించే 300 శ్రామిక్ స్పెషల్ ట్రైన్‌లను పక్కన పెట్టి అందుబాటులో ఉన్న ఇతర ట్రైన్‌ల సంఖ్య ఆధారంగా సేవలను దశలుగా ప్రారంభించనుంది. అయితే, ఈ ట్రైన్‌లలో ప్రయాణించేందుకు టికెట్‌లను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ (https://www.irctc.co.in/)లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లాట్‌ఫామ్ టికెట్ సహా అన్ని కేవలం ఆ వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంటాయి. రైల్వే స్టేషన్‌లలోని టికెట్ బుకింగ్ కౌంటర్‌లు మూసే ఉంటాయి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో కన్ఫామ్ అయిన టికెట్ ఉన్నవారినే స్టేషన్‌లోకి ప్రవేశముంటుంది. ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. స్క్రీనింగ్ టెస్టులో కరోనా లక్షణాలు లేకుంటేనే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతున్న ఈ ట్రైన్‌ల షెడ్యూల్‌ను ప్రత్యేకంగా విడుదల చేయబోతున్నట్టు భారతీయ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.