విషాదాంతమైన బాలుడి కిడ్నాప్

by Shyam |
విషాదాంతమైన బాలుడి కిడ్నాప్
X

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లాలో కిడ్నాప్‌నకు గురైన ఏడాదిన్నర బాలుడి కథ విషాదాంతం అయ్యింది. బాసర రైల్వేస్టేషన్‌లో దొరికిన ఓ గుర్తు తెలియని చిన్నారి మృతదేహం ఇటీవల కిడ్నాప్‌నకు గురైన బాలుడిదిగా పోలీసులు ప్రాథమిక విచారణకు వచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 11న నవీపేట దండిగుట్టకు చెందిన లక్ష్మీ అనే మహిళ తన కుమారుడితో కలిసి వేరే గ్రామానికి వెళ్తుండగా… మధ్యలో నాగరాజు అనే వ్యక్తి ఆమెతో మాటలు కలిపి, మత్తు మందు ఇచ్చి ఏడాదిన్నర బాలుడు అంజిని అపహరించుకుపోయాడు. మత్తులో నుంచి తేరుకున్న తర్వాత ఆ మహిళ ఎంత వెతికినా బాలుడు దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అప్పటి నుంచి ముమ్మర గాలింపు చేపట్టిన పోలీసులకు బాలుడీ ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ వద్ద నాగరాజు కనిపించడంతో తమ కొడుకు ఎక్కడున్నాడో చెప్పాలని అంజి తల్లిదండ్రులు చితకబాదారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. అయితే ఈనెల 19న బాసర రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని బాలుడి మృతదేహం లభ్యం కాగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో నాగరాజును పోలిన వ్యక్తి బాసర సీసీ కెమెరాల్లో ఉన్నది ఒక్కరేనని భావిస్తున్నారు. బాలుడి కిడ్నాప్, హత్యపై పోలీసులు విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

Next Story