మెదక్ లో విషాదం..

by Shyam |
మెదక్ లో విషాదం..
X

దిశ, మెదక్: జిల్లాలో విషాదం చోటు చేసుకున్నది. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ధర్మారంలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి. ధర్మారం గ్రామానికి చెందిన విజయ్ కుమార్ రెడ్డి(26)- రుచిత(24)లు భార్యాభర్తలు. కుటుంబ కలహాలతో రెండురోజుల క్రితం వీరిద్దరూ పురుగుల మందు తాగారు. విషయం తెలిసి వారిని సిద్ధిపేట మెడికల్ కళాశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం దంపతులిద్దరూ మృతి చెందారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న సిద్ధిపేట వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story